PEDDA SESHA VAHANAM HELD _ శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Vontimitta, 17 April 2024: As a part of the ongoing annual Brahmotsavam in Vontimitta Kodanda Ramalayam in Kadapa district, in the night of Wednesday, the utsava idols of Sri Sita Lakshmana asameta Sri Rama were paraded along the mada streets on Sesha Vahana to bless the devotees.

Legend says that Adisesha is one of the favourite carriers of Sri Rama as its believed that the incarnations  Lakshmana, Balarama in the guise of brothers in aeon were close to Him.

Sesha Vahana is symbolic of Dasya Bhakti that is a complete surrender before the Lord without any expectations.

TTD officials participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

తిరుపతి, 2024 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన బుధ‌వారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది.

ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌విన్‌ తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.