PEDDA SESHA VAHANAM IN TIRUMALA ON OCTOBER 23_ అక్టోబరు 23న పెద్దశేష వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్పస్వామివారు
Tirumala, 14 October 2017: In connection with Nagula Chaviti on October 23, the processional deity of Lord Sri Malayappa Swamy will take celestial ride on Pedda Sesha Vahanam along with His two consorts, Sridevi and Bhudevi.
Pedda Sesha is believed to be the Adisesha-the mighty 1000 hooded Serpent King, who serves Lord in various ways as His divine bed, jewel, umbrella and express his loyalty towards His beloved Master.
Even Lord Venkateswara is referred by various names with a prefix of Sesha including Seshasayana, Seshastutyaha, Seshadrinilaya, Seshasailavasa etc.
The procession will take place in four mada streets from 7pm to 9pm.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
అక్టోబరు 23న పెద్దశేష వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, 2017 అక్టోబరు 14: తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తియైన శ్రీ మలయప్ప స్వామివారు అక్టోబరు 23వ తేదీ నాగుల చవితి పర్వదినం సందర్భంగా తిరుమాడ వీధులలో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందుచేయనున్నారు.
కాగా సర్పరాజైన ఆదిశేషువు జగన్నాధునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యలాగా, ఛత్రంగా, కామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి విశేషసేవలందిస్తున్నట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీవారి ఆలయంలోని దాదాపు 8 శాసనాలపై శేషునిపై అనేక స్తుతి సూక్తులున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సహస్రనామాలలో ”శేషసాయి, శేషస్తుత్యః, శేషాద్రినిలయః” అంటూ నిత్య పూజలందుకుంటున్నాడు.
అంతే కాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాస భక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగత ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపజేస్తున్నారు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో తొలి ప్రాధాన్యత కూడా ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.
కాగా నాగుల చవితి పర్వదినంనాడు రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ తిరుమాడ వీధులలో పెద్ద శేషవాహన ఊరేగింపు జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.