PEDDA SESHA VAHANA SEVA TOOK PLACE_ పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం
TIRUPATI, 20 MARCH 2023: On the first day evening of the ongoing annual brahmotsavams in Sri Kodandarama Swamy temple, Pedda Sesha Vahana seva held in Tirupati on Monday.
Sri Kodandarama Swamy in all His divine splendour seated on the seven hooded Serpent Vahanam blessed devotees all along the Mada streets.
Both the Senior and Junior Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Smt Nagaratna, VGO Sri Manohar, temple officials, large number of devotees took part in the Vahana seva.
CULTURAL PROGRAMMES: The cultural programmes organised by TTD on the occasion allured the devotees.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం
తిరుపతి, 2023 మార్చి 20: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు సోమవారం రాత్రి 7 గంటల నుంచి పెద్దశేష వాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు స్వామివారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేశారు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమయ్యారు . తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, భక్తులు శేషుని వలే తనకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ మనోహర్,
ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, కంకణభట్టర్ శ్రీ ఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు :
శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఎస్వి సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు శ్రీ హరిబాబు – నాదస్వరం, శ్రీ శ్రీనివాసులు మరియు శ్రీ నాగేశ్వరరావు – డోలు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీమతి చిన్నమ్మ దేవి బృందం గాత్ర సంగీతం నిర్వహించారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ సురేష్ బృందం నృత్య కార్యక్రమం జరిగింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.