PITHAPURAM TEMPLE BTU FROM MARCH 20-25 _ మార్చి 20 నుండి 25వ తేదీ వ‌ర‌కు పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati,18  March 2024: TTD is organising the annual Brahmotsavam os Sri Padmavati Sammeta Venkateswara Swami temple, Peethapuram, Kakinada district from March 20-25 with Ankurarpanam fete on March 19 evening.

The celebrations begin with Dwajarohanam at 08,00-8.45 am on March 20 and grand srivari Kalyanotsavam in the evening. Important events include Garuda Vahana Seva on March 21 evening Unjal Sevas at night on March 22,23,24, Chakra snanam on March 25 morning and Dwajaavarohanam in the evening, and finally Pushp yagam on March 26 evening.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 20 నుండి 25వ తేదీ వ‌ర‌కు పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2024 మార్చి 18: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 20 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 19న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 20న ఉద‌యం 8 నుండి 8.45 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 గంట‌లకు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. మార్చి 21న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 22, 23, 24వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 25న ఉద‌యం 9 నుండి 10.45 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 26న సాయంత్రం 5.30 గంట‌లకు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.