PM OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న గౌ|| భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ
GUV AND CM ACCONPANY FOR DARSHAN
BOOKS ON ANTIQUE COINS PRESENTED TO PM
Tirumala, 9 Jun. 19: The Honourable Prime Minister of India Sri Narendra Modi offered prayers in the famous Hill Shrine of Sri Venkateswara Swamy on Sunday evening.
He was accompanied by Honourable Governor of AP Sri ESL Narasimhan and Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to the temple.
Earlier he given warm reception on his arrival at Mahadwaram of the temple by TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Later he had darshan of Sri Venkateswara Swamy inside the sanctum sanctorum. The chief priest explained to him about the mythological importance and manifestation of the presiding deity and significance of the ornaments adorned to the Lord.
VISITS SUB-SHRINES
Later the PM has also visited all the sub shrines including Vakula Mata, Bhashyakarulavaru, Yoga Narasimhaswamy and also made offerings in the Hundi.
The Honourable Prime Minister was also informed about the average number of pilgrims visiting Tirumala temple every day, about laddus, hundi collection and other details by TTD EO and Tirumala JEO.
VEDASIRVACHANAM:
Later, the Head of the Nation was offered Vedasirvachanam by vedic pundits at Ranganayakula Mandapam. EO and JEO offered PM the sacred theertha prasadams and laminated photo of Sri Venkateswara Swamy.
Among the VIPs who were present includes Union MoS for Home Sri Kishen Reddy, MP Sri Reddeppa, Deputy CM and Minister Sri Narayanaswamy, Minister Sri P Ramachandra Reddy, TUDA Chief Sri C Bhaskar Reddy, Local legislator Sri B Karunakar Reddy and others were also present.
BOOK ON ANTIQUE COINS
Tirumala, 9 Jun. 19: The EO also presented him the twin books published by TTD on antique coins in the treasury of TTD offered by various kings titled “Gold coins in the Srivari Hundi of Lord Venkateswara”, “Silver, copper and other metal coins in the Hundi of Lord Venkateswara”.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న గౌ|| భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ
తిరుమల, 2019 జూన్ 09: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం సాయంత్రం గౌ|| భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ దర్శించుకున్నారు. ఆయన వెంట ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గౌ|| శ్రీ జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీ నారాయణస్వామి, డా..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ డా.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు శ్రీ కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద గౌ|| భారత ప్రధానికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| ప్రధాని శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు చెల్లించి, భాష్యకార్లను, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధానికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఈవో, జెఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను గౌ|| ప్రధాని శ్రీ నరేంద్రమోడీ, గౌ|| గవర్నరు శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.