POLIO DROPS ADMINISTERED_ పల్స్‌పోలియోను ప్రారంభించిన జెఈవో
Tirumala, 28 January 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju administered polio drops to children who are aged below five years in front of Srivari temple on Sunday morning.
The 24th Pulse Polio programme observed at 25 places in Tirumala out of 18 centres were allotted for pilgrims and remaining to locals.
Speaking on this occasion the JEO said, this pulse polio program is useful to all parents with infants aged between 0-5years. Especially who have come for darshan from far away places. To facilitate them we have arranged polio drop centres at various places”, he added.
Chief Medical Officer Dr Nageswara Rao, SMO Dr Murlidhar, Superintendent Ashwini Hospital Dr Narmada were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పల్స్‌పోలియోను ప్రారంభించిన జెఈవో
తిరుమల, 2018 జనవరి 28: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమలలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ఇందుకోసం తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశామన్నారు. వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బందికి కలిపి 200 మంది సేవలందిస్తున్నట్టు తెలిపారు. మార్చి 11న మలివిడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు, ఎస్ఎంఓ డా|| మురళీధర్, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా|| నర్మద పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.