PONNAKALVA UTSAVA AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఏకాంతంగా పొన్నకాల్వ ఉత్సవం

Tirupati, 27 Apr. 21: On the occasion of Chitra pournami festivities on Tuesday, the TTD organised the Ponca Kalva Utsavam at Sri Govindarajaswamy temple in ekantham due to Covid-19 guidelines

As part of celebrations, Snapana thirumanjanam was performed for utsava idols of Sri Govindarajaswami and his consorts, Sri Krishna, Sri Andal and Viswaksena. Thereafter the archakas observed alankaram and sattumora and paraded the idols in the temple prakaram.

Special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Superintendent Sri Venkatadri, Inspector Sri Munindrababu, Sri Kamaraj, archakas and staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఏకాంతంగా పొన్నకాల్వ ఉత్సవం

తిరుపతి, 2021 ఏప్రిల్ 27: చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పొన్నకాల్వ ఉత్సవం మంగ‌ళ‌వారం జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ ఉత్స‌వాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, విష్వ‌క్సేనుల‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకరణ, సేవాకాలం, సాత్తుమొర చేపట్టారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల‌ను ఊరేగించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.