PONNAKALVA UTSAVAM HELD IN TIRCHANOOR_ ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
Tiruchanoor, 29 April 2018: The Festival of Summer Resort-Ponnakalva Utsavam was observed with religious fervour on the auspicious day of Chitra Pournami on Sunday as a part of Vasanthotsavam at Tiruchanoor.
Tirumala Tirupati Devasthanams (TTD) has embarked on a mission of reviving old and traditional rituals. One such important festival is “Ponnakalva Utsavam” which was revived by TTD in 2007 after 25 years.
The processional deities of Lord Govinda Raja Swamy, Goddesses Sri Devi, Bhu Devi, Andal Sri Goda Devi, Lord Sri Krishna Swamy and commander-in-chief Vishwaksena were taken out on a procession from Sri Govinda Raja Swamy temple before sun rise to Ponnakalva Mandapam located in Tiruchanoor road.
Here the priests performed Snapana Tirumanjanam giving celestial bath with aromatic substances to the deities who were halted for a summer holiday providing solace.
The unique feature is that Snapana Tirumanjanam is performed on Swing (usually deities will be seated on a platform while rendering celestial bath). Hundreds of villagers thronged to see this interesting religious fete.
Later in the evening, since Lord Govinda Raja Swamy paved a visit to the house of His younger brother Lord Venkateswara Swamy who resides at Tiruchanoor in the residence of Goddess Padmavathi Devi.
An interesting custom takes places here where the Goddess Padmavathi greets Her brother-in-law at the entrance with one door open and standing behind the closed door as a mark of respect as per the age-old tradition. After their celestial meet, Lord Sri Govindaraja Swamy returns to His temple in the evening with which the religious event concludes.
TTD has made elaborate arrangements for this event. Annaprasadam was also distributed to the devotees who took part in this celestial fete.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
తిరుపతి, 2018 ఏప్రిల్ 29: చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తదితర తొమ్మిది మంది దేవేరుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకుంది.
అనంతరం అక్కడ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మీ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.