డిసెంబరు 1న అక్కదేవతల కార్తీకమాస పూజ
డిసెంబరు 1న అక్కదేవతల కార్తీకమాస పూజ
నవంబరు 29, తిరుమల, 2017: టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడుగురు అక్కదేవతలకు డిసెంబరు 1వ తేదీన కార్తీకమాస పూజ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు పూజాకార్యక్రమం జరుగనుంది.
ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణించే భక్తులు సురక్షితంగా గమ్యస్థానం చేరాలని కోరుతూ ప్రతి ఏటా అక్క దేవతలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.