GARUDA AND NANDI VAHANAMS IN KADAPA TEMPLES ON JULY 8- తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల

Tirupati, 21 June 2017: In connection with annual Brahmotsavams of Sri Chennakeshava and Sri Siddheswara swamy temples of TTD in Kadapa district, the Garuda and Nandi vahanams of the respective temples will be on July 8.

Tirupati JEO Sri P Bhaskar released the posters related to these two temples on Wednesday in his chambers in TTD administrative building. Speaking on this occasion the JEO said the annual fete in both the TTD taken over temples will commence on July 4 and concludes on July 12 with Ankurarpanam on July 3.

Outside temples DyEO Sri Subramanyam was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI


తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల – గోడ పత్రికలు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో

తిరుపతి, 2017 జూన్‌ 21: టిటిడికి అనుబంధంగా వున్న కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ జూలై 4 నుండి 12వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి వాహనసేవలలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

04-07-2017(మంగళవారం) ధ్వజారోహణం చిన్నశేష వాహనం

05-07-2017(బుధవారం) పల్లకీసేవ హంస వాహనం

06-07-2017(గురువారం) పల్లకీసేవ సింహావాహనం

07-07-2017(శుక్రవారం) పల్లకీసేవ హనుమంత వాహనం

08-07-2017(శనివారం) పల్లకీసేవ శిఖర దీపారాధనం, గరుడ వాహనం

09-07-2017(ఆదివారం) ——– ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం

10-07-2017(సోమవారం) ——– రథోత్సవం

11-07-2017(మంగళవారం) ——- అశ్వవాహనం

12-07-2017(బుధవారం) వసంతోత్సవం ధ్వజావరోహణం

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

04-07-2017(మంగళవారం) ధ్వజారోహణం హంస వాహనం

05-07-2017(బుధవారం) పల్లకీసేవ చంద్రప్రభ వాహనం

06-07-2017(గురువారం) పల్లకీసేవ చిన్నశేషవాహనం

07-07-2017(శుక్రవారం) పల్లకీసేవ సింహ వాహనం

08-07-2017(శనివారం) పల్లకీసేవ శిఖర దీపారాధనం, నందివాహనం

09-07-2017(ఆదివారం) ——– ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం

10-07-2017(సోమవారం) ——– పల్లకీసేవ

11-07-2017(మంగళవారం) ——- పార్వేటి ఉత్సవం

12-07-2017(బుధవారం) వసంతోత్సవం ధ్వజావరోహణం

జూలై 9వ తేదీ శ్రీ చెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్నవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, ఒక లడ్డూ, ఒక వడ, అన్న ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 13వ తేదీ ఉదయం 9.00 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ చెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్లకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.