“YOGA IS HEALTHY WAY OF LIVING”-TIRUPATI JEO SRI P BHASKAR- మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధం

THIRD INTERNATIONAL YOGA DAY OBSERVED BY TTD IN A BIG WAY

Tirupati, 21 June 2017: Yoga is not restricted to any religion, but is essential to lead healthy way of living that aims towards ‘a healthy mind in a healthy body’, advocated Tirupati JEO Sri Pola Bhaskar.

The Third International Yoga Day has been observed with utmost zeal by TTD in SV Ayurvedic College premises grounds on Wednesday. Speaking on this occasion the JEO said, “Man is a physical, mental and spiritual being and Yoga helps to promote a balanced development of all the three to become a perfect individual”.

“It is a well known fact that Yoga emerged in India some thousands of years ago taught by our great saints. But every individual is accustomed to busy way of life in this mechanical age. To bring back the past glory our Honourable Prime Minister Sri Narendra Modi gave a clarion call to observe June 21 as “Yoga Day” which was also approved by UNGA for global health and today it is observed across the world in a big way”, the JEO added.

The Ramakrishna Mutt president of Tirupati wing Sri Anupamananda Swamy in his speech said that Yoga is an invaluable gift of India’s ancient tradition. It embodies unity of mind and body; thought and action; restraint and fulfillment; harmony between man and nature; a holistic approach to health and well-being.

Earlier Sri Raghu Guruji of Satya Sai Seva Organisation from Vizag taught students and people who attended the Yoga with various asanas.

College Principal Dr Shankar Babu, Dr Parvathi, EE Sri Jaganmohan Reddy, DEO Smt Snehalatha, Dr Muralikrishna, Dr Sunil and others faculty, students were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధం : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధమని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం టిటిడి ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ యోగా అంటే ఆసనాలు, శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా అత్యంత పురాతనమైనదని, వేదకాలం నుంచి దాని ప్రస్తావన ఉందని తెలిపారు. మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా పుట్టిన భారతదేశంలోనే వాటి పట్ల శ్రద్ధాశక్తులు తగ్గాయని, వాటిని పూర్వ దశకు తీసుకువచ్చేందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టిటిడి చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అందించామన్నారు. ఎస్వీ యోగాధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరించి, టిటిడి కళాశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, వీరి ద్వారా మిగిలిన విద్యార్థులకు కూడా నేర్పిస్తామని వెల్లడించారు.

అంతకుముందు విశాఖపట్నంకు చెందిన శ్రీసత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి శ్రీ రఘు గురూజీ ఈ సమావేశానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు ఎలా వేయాలి, వాటి వల్ల ఉపయోగాలను తెలియజేస్తూ శిక్షణ ఇచ్చారు. యోగాకు భారతదేశం విశ్వ గురువు అని శ్రీరామకృష్ణమఠం కార్యదర్శి శ్రీ అనుపమానంద స్వామీజీ అన్నారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం బావుండాలని, అందుకు యోగా ఒక్కటే ఉత్తమమైన ఆయుధమని తెలిపారు.

అనంతరం శ్రీ రామకృష్ణ మఠం కార్యదర్శి శ్రీ అనుపమానంద స్వామీజీ, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి శ్రీ రఘు గురూజీలను శాలువ, శ్రీవారి చిత్రపటాలతో జెఈవో శ్రీ పోల భాస్కర్‌ సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| ఎ.శంకర్‌బాబు, ఇతర అధికారులు, సిబ్బంది, టిటిడి కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.