POTU WORKERS AND VAHANAM BEARERS EXTEND THANKS TO TTD BOARD CHIEF _ టీటీడీ చైర్మన్ కు పోటు కార్మికులు, వాహనం బేరర్ల కృతఙ్ఞతలు
TIRUMALA, 26 DECEMBER 2023: The Srivari Temple Potu workers and Vahanam bearers thanked TTD Chairman Sri Bhummana Karunakara Reddy for the decision to hike their salaries during the board meeting held at Tirumala on Tuesday.
The Potu workers expressed their immense happiness for increasing their salary by Rs.10thousands at a time and said around 600 families would benefit because of this decision.
Earlier, the vehicle bearers met the TTD Chairman and expressed their happiness over the decision to accept their request and recognize them as skilled workers and enhancing their salaries.
టీటీడీ చైర్మన్ కు పోటు కార్మికులు, వాహనం బేరర్ల కృతఙ్ఞతలు
తిరుమల 26 డిసెంబరు 2023: పోటు కార్మికులకు 10 వేల జీతం పెంచుతూ మంగళ వారం నిర్ణయం తీసుకోవడం పట్ల తిరుమల శ్రీవారి ఆలయ పోటు కార్మికులు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి దర్శనానికి వెళ్ళిన చైర్మన్ ను పోటు కార్మికులు ఆలయంలో కలసి కృతఙ్ఞతలు తెలిపారు. తమకు ఒక్క సారిగా 10వేల జీతం పెరుగుతుందని కలలో కూడా ఊహించలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు కృతజ్ఞతగా ఉంటాయని చెప్పారు. సుమారు 600 కుటుంబాలకు దీని వల్ల ప్రయోజనం కలిగిందని వారు చెప్పారు.
అంతకు ముందు వాహనం బేరర్లు చైర్మన్ ను కలసి తమ అభ్యర్థన మన్నించి తమను స్కిల్డ్ వర్కర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే ఈ సహాయం చేస్తారని తాము ఊహించలేదని కృతఙ్ఞతలు తెలిపారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది