POTU WORKERS TRAINED ON FIRE FIGHTING TECHNIQUES_తిరుమలలోని పోటు కార్మికులకు అగ్నిమాపక సిబ్బంది శిక్షణ

Tirumala, 9 September 2017: To respond quickly to fire accidents if any in the Boondi Potu located outside the Tirumala temple premises, the Potu workers were given training on fire fighting technique by the Fire Department officials in Tirumala on Saturday.

Earlier the Chief Vigilance and Security Officer of TTD Sri A Ravikrishna along with Assistant Divisional Fire Officer Sri Srihari Jagannatham visited the site of Gas plant and identified some improvements which need to be taken up immediately. Later they also suggested to constitute a committee in the occurrence of any fire accidents to overcome such incidents in future.

Later the ADFO and his team taught some techniques practically to the Potu workers to stop the fire if any without delay. Temple DyEO Sri Kodanda Rama Rao, VGO Sri Ravindra Reddy, AEO Potu Sri Ashok were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలోని పోటు కార్మికులకు అగ్నిమాపక సిబ్బంది శిక్షణ

సెప్టెంబర్‌ 09, తిరుమల 2017: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూంది తయారుచేసే పోటులో విధులు నిర్వహిస్తున్న పోటు కార్మికులకు శనివారంరనాడు అగ్నిమాపక అధికారులు ప్రత్యేక శిక్షణనిచ్చారు.

తిరుమల శ్రీవారి ప్రసాదలైన లడ్డూలకు సంబంధించిన బూందిని తయారు చేస్తునప్పుడు ఏదేని అగ్ని ప్రమాదాలు సంభవించిన పక్షంలో వెంటనే మంటలను ఎలా ఆర్పాలి అనే అంశంపై అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా పోటు కార్మికులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో తి.తి.దే సి.వి.ఎస్‌.ఓ శ్రీ ఆకె.రవికృష్ణ, ఎ.డి.ఎస్‌.ఓ శ్రీ శ్రీహరిజగన్నాధం, ఆలయ డిప్యూటి.ఈ.ఓ శ్రీ కోదండరామారావు తదితరులు పాల్గొన్నారు.

అంతకు పూర్వం సి.వి.ఎస్‌.ఓ, ఎ.డి.ఎస్‌.ఓలు తిరుమలలో ఉన్న గ్యాస్‌ ప్లాంట్‌ ప్రదేశాన్ని కూడా సందర్శించారు. ఈ ప్రాంతంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అక్కడ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తిరుమలలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు అబిప్రాయపడ్డారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.