POURNAMI GARUDA SEVA ATTRACTS HUGE CROWDS _ పౌర్ణమి గరుడ సేవలో ఘనంగా నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

Tirumala, 9 Feb. 20: Pournami Garuda Seva was observed with celestial fervour on Sunday evening at Tirumala on the auspicious occasion of Magha Pournami amidst huge gathering of pilgrims in the galleries of mada streets. 

The Lord glided on His favourite carrier Garuda along the four-mada streets, blessing His devotees. 

The paraphernalia in front of the vahanam along with rhythmic recitation of the Nalayira Divya Prabandha Parayanam by Parayanamdars added the majesty to the procession.

HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, Spl Invitee of TTD Board Sri B Karunakar Reddy, Board Member Sri Venkataprasad Kumar, Additional EO Sri AV Dharma Reddy, DyEO Sri Harindranath and others were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

పౌర్ణమి గరుడ సేవలో ఘనంగా నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

పారాయణంతో మార్మోగిన మాడ వీధులు

ఫిబ్రవరి 09, తిరుమల 2020: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో
నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఘనంగా జరిగింది. జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు చక్కటి స్వరంతో దివ్యప్రబంధ పారాయణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీ సి.వెంక‌ట‌ప్ర‌సాద్ కుమార్‌, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.