POURNAMI GARUDA SEVA IN SRI GT ON NOV 4_ నవంబరు 4న శ్రీగోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

Tirupati, 1 November 2017: The TTD plans to conduct the celestial event of pournami Garuda seva in the TTD sub temple of Sri Govindara Swamy Temple, Tirupati on Saturday Nov 4.

As part of the ritual the deity of Govindarajaswamy will be paraded along the mada streets of the temple on his favorite garuda vahanam for benefit of devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నవంబరు 4న శ్రీగోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

నవంబరు 01, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు 4వ తేదీన శనివారం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరుగనుంది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.