ANNABHISHEKAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON NOV 3_ నవంబరు 3న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

Tirupati, 1 November 2017: TTD has plans to perform Annabhishekam in a grand scale at the TTD sub temple of Sri Kapileswara Temple on Friday Nov 3.
As part of the celebrations Shudoddakam will be performed at the temple in the morning ahead of Annabhisekham in the afternoon besides other rituals of Sahasranama Archana and Deeparathana.

Later in the evening devotees will get the Anna Linga alankara darshan at the temple and at night after Anna Linga udwasana and Suddhi, there will be suganda dravya bhisekham as a finale of the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నవంబరు 3న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

నవంబరు 01, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 3వ తేదీ శుక్రవారం అన్నాభిషేకం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం, అన్నలింగ అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నలింగ ఉధ్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 8 గంటలకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.