POURNAMI GARUDA SEVA IN TIRUMALA ON OCTOBER 24_ అక్టోబ‌రు 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 22 October 2018The monthly Pournami Garuda Seva will be observed on October 24 in Tirumala.

On this day, Sri Malayappa Swamy will take celestial ride on Garuda Vahanam in four mada streets between 7pm and 9pm.

Pilgrims will take part in large numbers in this vahana seva. Meanwhile exactly after 10 days of Navarathri Brahmotsava Garuda Seva on October 14, pilgrims are getting an opportunity to witness yet another Garuda Seva.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

అక్టోబ‌రు 22 , తిరుమల 2018: తిరుమలలో అక్టోబ‌రు 24వ‌ తేదీన బుధ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.