POURNAMI GARUDA SEVA OBSERVED_ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
Tirumala, 24 October 2018: In a span of just ten days gap, the pilgrims were thrilled to witness Sri Malayappa Swamy on Garuda Vahanam on Wednesday evening.
Pournami Garuda Seva was observed with celestial fervour in Tirumala between 7pm and 9pm. The processional deity was taken around the four mada streets on a colourful procession.
It may be mentioned here that the devotees had witnessed the Navarathri Brahmotsava Garuda seva exactly ten days ago on October 14.
Temple officials, huge number of pilgrims took part in this event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
అక్టోబరు 24, తిరుమల 2018: తిరుమలలో బుధవారం రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 14న గరుడసేవ జరిగింది. పౌర్ణమి సందర్భంగా మరోసారి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం విశేషం.
శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ కటాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, పార్‌పత్తేదార్ శ్రీ శశిధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.