POURNAMI GARUDA SEVA OBSERVED IN SRI GT_ వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

Tirupati, 24 October 2018: The Pournami Garuda Seva was observed with utmost devotion and religious fervour in Sri Govinda Raja Swamy temple on Wednesday.

The Garuda Vahana seva took place between 6pm and 8pm covering all the important streets encircling the shrine.

Large number of local devotees participated in this event.

Temple DyEO Smt Varalakshmi, Chief Priest Sri AP Srinivas Deekshitulu, AEO Sri Udaybhaskar Reddy, Suptd Sri Suresh and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

అక్టోబ‌రు 24 , తిరుప‌తి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జ‌రిగింది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎ.పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ సురేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ప్ర‌శాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.