POURNAMI GARUDA SEVA OBSERVED _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 25 March 2024: The monthly Pournami Garuda Seva was observed with celestial grandeur on the pleasant full moon bloom on Monday evening.

Sri Malayappa glided along four mada streets on Garuda Vahanam blessing His devotees.

HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, DyEO Sri Lokanatham and other officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2024 మార్చి 25: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.