POURNAMI GARUDA SEVA ON JUNE 28_ జూన్‌ 28న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 27 Jun. 18: The Pournami Garuda Seva will be observed in Tirumala on June 28.

The processional deity of Lord Sri Malayappa Swamy takes celestial ride on Garuda Vahanam and blesses pilgrim devotees along four mada streets.

The celestial ride will take place between 7pm and 9pm on Thursday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 28న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 27 జూన్‌ 2018: తిరుమలలో ప్రతినెలా పౌర్ణమిరోజు నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఈ నెల 28వ తారీఖున టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుఢారూరుడై గురువారం రాత్రి 7 గం||ల నుండి 9 గం||ల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీవారి వాహనసేవలలో గరుడ వాహనసేవ అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.