SHOBHA YATRA OF LAKSHMI HARAM_ వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు

Appalayagunta, 27 June 2018: Earlier Shobha Yatra of Lakshmi Kasula Haram took place. The famous Lakshmi Kasula Haram which is usually adorned to Lord Sri Malayappa Swamy during Garuda Vahana seva in Tirumala.

Tirumala temple DyEO Sri Harindranath brought the precious jewel and handed over the same to Appalayagunta temple AEO Sri Subramanyam.

On this occasion, a pair of Swarna Karna Patralu worth Rs.5.17lakhs was presented which will be adorned to presiding deity of Lord Sri Prasanna Venkateswara Swamy at Appalayagunta.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు

తిరుపతి, 2018 జూన్‌ 27: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకొచ్చిన లక్ష్మీహారం ఊరేగింపు బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద తిరుమల శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌ లక్ష్మీహారాన్ని స్థానిక ఆలయాల ఏఈవో శ్రీ సుబ్రమణ్యంకు అందజేశారు. ఆనంతరం అప్పలాయగుంట పురవీధుల గుండా ఊరేగింపుగా లక్ష్మీహారాన్ని ఆలయానికి తీసుకెళ్లారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయమానంగా ఊరేగింపు సాగింది.

ఇందులో భాగంగా బుధవారం రాత్రి గరుడ సేవలో ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడుడిని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రూ.5.17 లక్షలు విలువైన బంగారు కర్ణపత్రాలను కానుకగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అందించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, సూపరింటెండెంట్‌ శ్రీగోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ పార్థసారధి రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.