PRANAYA KALAHOTSAVAM HELD _ తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

TIRUMALA, 07 JANUARY 2023: The unique festival of Pranaya Kalahotsavam was held with utmost religious fervour in Tirumala on Saturday.

In this fete, Sri Malayappa Swamy on a special palanquin and Sridevi and Bhudevi on other palanquins were brought facing each other.

The Goddesses throw floral balls on Lord and the Lord tries to escape from the floral shots and seeks apologies to Goddesses. During this time the Acharya Purushas recite Pasurams in “Nindastuti” style and later with the Goddesses getting pacified, all the three return to the temple.

This Love Game enthralled devotees who assembled on the Galleries of East Mada Street facing Pushkarini.

The entire interesting episode will be enacted with Jeeyangars taking the side of Goddesses and some TTD officials on the side of Lord. 

HH Sri Pedda Jeeyangar, Sri Chinna Jeeyangar of Tirumala, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

తిరుమల, 2023 జనవరి 07: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింధాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.