ANDAL NEERATOTSAVAM FETE BEGINS_ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 07 JANUARY 2023: Sri Andal Neeratotsavam festivities commenced in Sri Govinda Raja Swamy temple on Saturday in Tirupati.

This will conclude on January 13. This festival is being observed every year to commemorate the occasion of Andal appeasing the Lord through Her penance.

Temple DyEO Smt Shanti, AEO Sri Ravi Kumar Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ప్రారంభం
 
తిరుపతి, 07 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
 
ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి  అభిషేకం నిర్వహించారు. ఆస్థానం చేపట్టారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి విఆర్.శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రసాదమూర్తిరాజు, భక్తులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.