SRIVARI PRANAYA KALAHOTSAVAM ON JAN 3_ తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Tirumala, 24 December 2017: As a feast to devotees, yet another festival of glitters, Srivari Pranaya kalahotsavam will be conducted at Srivari temple, Tirumala on January 3.

As part of the event utsava idols of Ammavaru and Swamy varu will be taken in procession on golden Palanquin separately from Vaibhavottsava Mandapam and co e to face to face.At that sport Archakas will recite. Divya Prabandha s both in praise and also critical of each other and later shower flowers as each side tries to escape from each other’s flower missiles.

The TTD has cancelled arjita Vasantotsavam and also Pournami Garuda Seva on January 2nd view of unique festival.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2017 డిశెంబరు 24: నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో కొలువైవున్న ఉత్సవాల దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయకలహోత్సవం జనవరి 3వ తారీఖున తిరుమలలో నేత్రపర్వంగా జరుగనుంది.

కాగా ప్రణయకలహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవమండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరుకొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు.

అటు తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం,స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జితసేవలైన వసంతోత్సవంసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

జనవరి 2న పౌర్ణమి గరుడసేవ రద్దు

ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను జనవరి 2వ తేదీ టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా జనవరి నెలలో పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.