PRANAYA KALAHOTSAVAM IN TIRUMALA ON DEC 23_ డిసెంబ‌రు 23న శ్రీవారి ప్రణయకలహోత్సవం

POURNAMI GARUDA SEVA CANCELLED ON DEC 22

Tirumala, 20 Dec. 18: Among the festivities that are being observed in Tirumala, here is an interesting fete, Pranaya Kalahotsavam (Lovers’ Quarrel Ceremony) that is scheduled to take place on December 23 on Sunday.

Usually this festival takes place on the 6th day after Vaikuntha Ekadasi. It may be mentioned here that Vaikuntha Ekadasi was observed on Decembe 18. Exactly after six days, Pranaya Kalahotsavam will take place in Tirumala.

On this day, the processional deity of Sri Malayappa Swami and His two consorts meets in front of Swami Pushkarini on different palanquins. The Goddesses and Lord face each other. The Jiyars, religious staffs and Officials split in to two categories with one team taking the side of Lord and other supporting Goddesses.

The Divya Prabandha Pasura Parayanam is rendered here. Later the “Love Game” will be enacted where in the Goddesses throw flower balls over Lord while the later runs backwards in order to get hit by these floral balls thrown by His two consorts. The Slokam which is rendered here is called “Ninda Stuti”. This interesting festival comes to an end with the Lord promising His consorts Sridevi and Bhudevi that he would remain loyal to them. Later they return to the temple.

This festival takes place between 4pm and 6pm. TTD has cancelled Vasanthotsavam in connection with this festival.

POURNAMI GARUDA SEVA CANCELLED ON DEC 22

The monthly Pournami Garuda Seva is cancelled by TTD on December 22 in Tirumala in view of Adhyayanotsavams.

The annual Adhyayanotsavams commenced in Tirumala on December 7 and will conclude on December 31.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 23న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2018 డిసెంబరు 20: నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో కొలువైవున్న ఉత్సవాల దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయకలహోత్సవం డిసెంబ‌రు 23వ తేదీన‌ తిరుమలలో వైభ‌వంగా జరుగనుంది.

కాగా ప్రణయకలహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవమండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు.

ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.

డిసెంబ‌రు 22న పౌర్ణమి గరుడసేవ రద్దు

ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను డిసెంబ‌రు 22వ తేదీన‌ టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 7వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.