PRAYED LORD TO BESTOW EVERY ONE WITH PEACE AND PROSPERITY” – AP CM_ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం : ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
EXTENDS SANKRANTHI GREETINGS
Tirumala, 14 January 2018: Extending the people of the state Makara Sankranthi wishes, the honourable CM of AP Sri N Chandrababu Naidu said, he prayed Lord Venkateswara to bless every one to live in peace and prosperity.
The state head offered prayers in the temple of Tirumala along with his family on the auspicious day bhogi on Sunday.
Earlier the CM and his entourage entered Tirumala shrine through Vaikuntham Queue Complex. TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO welcomed Sri KS Sreenivasa Raju welcomed the CM at Mahadwaram.
After darshan, the honourable CM, Minister Sri N Lokesh, Hindupuram Legialator Sri N Balakrishna were presented with seshavastram, theertha prasadams and lamination photo of Lord.
Later speaking to media outside temple the CM said, Lord Venkateswara is the most powerful universal deity. This unique power is attracting scores od devotees every day to Tirumala. TTD is also making elaborate arrangements for the benefit of the common devotees. I wish all the devotees a Happy Makara Sankranthi”, he maintained.
EO EXPLAINS CM ON RETRACTABLE ROOF
TTD EO Sri AK Singhal explained to honourable CM of AP Sri N Chandrababu Naidu on the retractable roof set up inside Tirumala temple between dhwaja stambham and Padikavali to shield pilgrims from inclement weather conditions.
DIG Sri Prabhakar Rao, Tirupati Urban SP Sri Abhishek Mohanty, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం : ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
తిరుమల, జనవరి 14, 2018: నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, యువతకు ఉపాధి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తనకు శక్తినివ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. గౌ|| ముఖ్యమంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల గౌ|| ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి భోగి పండుగనాడు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇలవేల్పు అయిన శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అత్యంత శక్తివంతమైన దేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆనందం, సుఖసంతోషాలు, మెరుగైన జీవనప్రమాణాలు ప్రసాదించాలని కోరుకున్నట్టు చెప్పారు. భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి గౌ|| ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్దకు చేరుకోగానే శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, ఇతర అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సభేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కలిసి గౌ|| ముఖ్యమంత్రికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, టిటిడి డైరీ అందించారు. శ్రీవారి నుంచి తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహానికి గౌ|| ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం స్వీకరించి తిరుపతికి వెళ్లారు.
ముడుచుకునే పైకప్పును గౌ|| ముఖ్యమంత్రికి చూపిన టిటిడి ఈవో :
శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం నుంచి పడికావలి వరకు ఏర్పాటుచేసిన ముడుచుకునే పైకప్పును గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ చూపారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. అదేవిధంగా భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను గౌ|| ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే శ్రీబాలకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న, డిఐజి శ్రీ ప్రభాకరరావు, అర్బన్ ఎస్‌పి శ్రీ అభిషేక్ మహంతి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.