PRAYED LORD VENKATESWARA TO GIVE ME STRENGTH TO ESTABLISH “A ZERO POVERTY STATE” _ తిరుమలలో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణ ప్రతి ద్వనించాలి

AMARAVATI TO EMERGE ON THE LINES OF HYDERABAD SOON

BY 2047 TELUGU PEOPLE WILL EMERGE NUMBER ONE IN THE WORLD

-AP CM SRI NARA CHANDRA BABU NAIDU

TIRUMALA, 13 JUNE 2024: Asserting that India would emerge Numero Uno in the world by 2047 with the Telugu people occupying a pride place in this achievement, the Honourable CM of AP Sri Nara Chandra Babu Naidu said, he prayed Sri Venkateswara Swamy to give him enough strength to build a “Zero Poverty State” soon by reducing economic imbalances and establishing a developed state.

During a press conference arranged at Sri Gayatri Nilayam Rest House in Tirumala, the CM told media persons that being the native of the place, his day commences offering prayers to Lord Venkateswara. Recalling his childhood memories he said, he used to walk all the way from Srinivasa Mangapuram to Tirupati during his school and college days. “Sri Venkateswara Swamy also happens to be our Kuladaivam and all these years I overcame all the struggles and challenges that I faced in my life including the claymore mine attack, political assaults etc. with the strength and courage provided to me with the benign blessings of Sri Venkateswara Swamy and the unflinching support extended by my family members during the high time which I faced in the last five years”, he affirmed.

He said, the development of the state has seen a decline in the last five years and there is every need to revamp the structure for which he sought the blessings of Sri Venkateswara. “I want to commence my activity starting with Tirumala by protecting its sanctity. Aiming at making Tirumala, a must-visit place of pilgrimage for every Hindu devotee during his lifetime. Tirumala should echo with the divine chants of Govinda Namas alone. I prayed to Lord Venkateswara to bless with enough strength to achieve all these goals”, he reiterated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుమలలో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణ ప్రతి ద్వనించాలి

– త్వరలో హైదరాబాద్‌ తరహాలో అమరావతి పునః నిర్మాణం

– 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తెలుగు ప్రజలు

– రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

తిరుమల, 2024 జూన్ 13: దేశం, రాష్ట్రంలోని ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించాలని, ఆర్థిక అసమానతలను తొలగించి, త్వరలో “పేదరిక రహిత రాష్ట్ర స్థాపనకు శక్తిని” ప్రసాదించమని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

తిరుమలలోని శ్రీ గాయత్రీ నిలయం విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుందని, ఇందులో తెలుగువారిని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తనకు శక్తిని ప్రసాదించమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. తాను ఈ ప్రాంత స్థానికుడు కావడంతో ప్రతి రోజు శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణతోనే తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తన పాఠశాల, కళాశాల రోజుల్లో శ్రీనివాసమంగాపురం, తిరుపతికి నడిచి వెళ్లే సమయంలో తిరుమల శ్రీవారిని స్మరించుకున్నట్లు చెప్పారు. “శ్రీవేంకటేశ్వర స్వామి తమ కులదైవమని, గతంలో తనపై జరిగిన క్లైమోర్‌ మైన్‌ దాడి, గత ఐదేళ్లలో రాజకీయ దాడులతో సహా తన జీవితంలో ఎదుర్కొన్న అన్ని పోరాటాలు, సవాళ్లను శ్రీవారి ఆశీర్వాదం మరియు నా కుటుంబ సభ్యుల మద్దతుతో తాను ధైర్యంతో అధిగమించానన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి క్షీణించిందని, శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహంతో మనమందరం కలిసి పునఃరుద్ధరించాలన్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని “తిరుమల పవిత్రతను కాపాడటం”తో ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలను ప్రతి హిందూ భక్తుడు తన జీవితకాలంలో తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకునన్నారు.

తిరుమలలో అనునిత్యం గోవింద నామ స్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని ఆ దిశగా తాను అడుగులు ముందుకు వేస్తారని తెలిపారు. ఈ లక్ష్యాలన్నింటిని సాధించడానికి తగినంత శక్తిని అనుగ్రహించమని తాను శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు పునరుద్ఘాటించారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.