PREPARE AN ACTION PLAN TO ATTRACT MORE DEVOTEES TO LOCAL TEMPLES: JEO VEERABRAHMAM _ టిటిడి స్థానికాలయాలను ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి : జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య

Tirupati, 20 October 2021: TTD Joint Executive Officer, Sri Veerabrahmam has directed officials to prepare an action plan to attract more devotees to TTD local temples.

Addressing a review meeting on the development of TTD local temples at the conference hall in TTD administrative building on Wednesday evening, the TTD JEO said senior officials should be tasked for a time-bound six months action plan to attract devotees to local temples.

He said in this direction the Sapthagiri magazine SVBC channel and all publicity modem should be exploited.

He said the TTD website should be updated with legends of local temples, devotional significance, facilities available etc. to spread awareness among devotees. He said the information on drinking water; officials should coordinate Anna Prasadam, toilets etc. Concerned officials heading the task force should also make a checklist of ‘ must do’ whenever they visit these temples and submit reports.

FA& CAO Sri O Balaji, DLO Sri Reddappa Reddy, Additional CVSO Sri Shivkumar Reddy, DyEO (general) Sri Ramana Prasad and other senior officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానికాలయాలను ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి : జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 20: టిటిడి ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆలయాలను ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు చక్కగా విధులు నిర్వహించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో ఆలయాల వారీగా అభివృద్ధిని చేసి చూపాలన్నారు. ఆలయాల స్థలపురాణం, ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సప్తగిరి మాసపత్రిక, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టిటిడి వెబ్ సైట్ లో ఆలయాల స్థల మహత్యం, చరిత్ర, వసతులు ఇతర విషయాలను వివరంగా పొందుపరచాలని, తద్వారా సుదూర ప్రాంతాల భక్తులు సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యంగా సంబంధిత ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీనియర్ అధికారులు ఆయా ఆలయాలను సందర్శించినప్పుడు చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎఫ్ఎ అండ్ సిఎఓ శ్రీ బాలాజి, న్యాయాధికారి శ్రీ రెడ్డప్ప రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈఓ జనరల్ శ్రీ రమణ ప్రసాద్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.