PREPARED FOR VAIKUNTHA DWARA DARSHANAM- TIRUMALA JEO_ భ‌క్తులకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

Tirumala, 11 December 2018: The arrangements for ensuing Vaikuntha Ekadasi and Dwadasi are almost completed and TTD has geared up to provide darshan to 1.70 lakh pilgrims on December 18 and 19, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The JEO along with senior officers inspected the arrangements for nearly two hours on Tuesday. As a part of the inspection the officials four mada streets, Kalyana Vedika, Outer Ring Road, Narayanagiri gardens where the queue lines and shelters were laid.

Later speaking to media persons the JEO said

* Pilgrims are allowed to enter into the compartments of Vaikuntham 2 through MBC 26 gate from 10am onwards on December 17

* After the filling of compartments of VQC 2 and then VQC 1, the pilgrims will be allowed to enter into the sheds constructed in Narayanagiri Gardens

* After filling of all sheds in Narayanagiri Gardens, the pilgrims will be allowed to enter in to the special sheds arranged in four mada streets galleries through N 1 gate and the arrangements were made to about 32 thousand pilgrims here.

* When these galleries also gets filled then the devotees will be allowed in Kalyana Vedika

* Beyond this point, the pilgrims will be made to wait in the queue lines laid at New Seva Sadan building.

* The provision of darshanam on Vaikunta Ekadasi is for 80 thousand pilgrims and 90 thousands on Dwadasi.

So the devotees are requested to plan their darshanam to avoid waiting.

SE 2 Sri Rmachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, HO Dr Sermista, Annaprasadam SO Sri Venugopal, VGO Sri Manohar were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భ‌క్తులకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

డిసెంబ‌రు 11, తిరుమల 2018: డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, డిసెంబ‌రు 19న ద్వాద‌శి రోజుల్లో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని, ఈ రెండు రోజుల్లో దాదాపు 1.70 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆల‌య మాడ వీధులు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, క‌ల్యాణవేదిక‌, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు, క్యూలైన్ల‌ను అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం జెఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ డిసెంబ‌రు 17న ఉద‌యం 10 గంట‌ల నుండి ఎంబిసి-26 వ‌ద్దగ‌ల గేటు ద్వారా భ‌క్తుల‌ను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 2లోకి అనుమ‌తిస్తామ‌న్నారు. భ‌క్తుల‌ను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 1లోకి అనుమ‌తిస్తామ‌ని, అవి నిండిన త‌రువాత వ‌రుస‌గా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లలోకి పంపుతామ‌న్నారు. ఆ త‌రువాత ఎన్‌1 గేటు ద్వారా మాడ వీధుల్లో ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన షెడ్ల‌లోకి అనుమ‌తిస్తామ‌ని, ఇక్క‌డ 32 వేల మంది భ‌క్తులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. ఈ షెడ్లు కూడా నిండితే క‌ల్యాణ‌వేదిక వ‌ద్దకు, ఆ త‌రువాత నూత‌న సేవా స‌ద‌న్ వ‌ద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్ల‌లోకి భ‌క్తుల‌ను పంపుతామ‌న్నారు. షెడ్ల వ‌ద్ద తాగునీరు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించామ‌ని తెలిపారు. వైకుంఠ ఏకాద‌శి నాడు 80 వేల మందికి, ద్వాద‌శి నాడు 90 వేల మందికి స్వామివారి ద‌ర్శ‌నం చేయించే అవకాశ‌ముంద‌ని, భ‌క్తులు ఎక్కువ స‌మ‌యం క్యూలైన్ల‌లో వేచి ఉండ‌కుండా త‌మ తిరుమ‌ల యాత్ర ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోరారు.

జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-2 శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ర్టిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా.. శ‌ర్మిష్ట‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ త‌దిత‌రులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.