TIRUCHANOOR SARE PROCESSION AT TIRUMALA_ డిసెంబరు 12న శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Tirumala, 11 December 2018: Following the auspicious Panchami Theertham, the procession of Tiruchanoor Sare from Tirumala commences from Tirumala temple during the early hours on Wednesday.

The sare happens to the precious gift from Lord to His lady love on the laters’ birthday which happens to be Tiruchanoor Panchami. The pre-dawn rituals commences with the procession of Parimalam, tulasi Garlands and other valuable ornaments to be presented to Goddess from Her better half.

This sare will be carried on temple elephants circumambulating four mada streets and then taking to Tiruchanoor.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డిసెంబరు 12న శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

డిసెంబ‌రు 11, తిరుమల 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 12వ తేదీ బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను పంప‌నున్నారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి, శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ‌తారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.