PRESIDENT OF SRILANKA OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న శ్రీలంక రాష్ట్ర అధ్యకక్షులు
Tirumala 09 Feb,2013: President of Sri Lanka Mr. Mahinda Rajapaksa accompanied by his wife Ms.Shiranthi Rajapakse and Family members offered Prayers to Lord Venkateswara at Tirumala on wee hours of Saturday morning during Suprabatham Seva. On his arrival at Vaikuntam Q Complex 1 TTD JEO Sri K.S.Sreenivasa Raju and officials have welcomed the President. After dharshan of lord, the TTD JEO presented Sri Vari Prasadam,Books and Photo Frame, the veda pundits of the temple have blessed him with Vedic Hymns at Ranganayakula Mandapam.
Supdt of Police(Tirupati Urban) Sri SV Rajasekhar Babu, C.V&S.O Sri GVG Ashok Kumar, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Chinnamgari Ramana, Temple Peishkar Sri Rama Rao, Reception Officials Sri Venkataiah, Sri Damodar and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న శ్రీలంక రాష్ట్ర అధ్యకక్షులు
తిరుమల, 9 ఫిబ్రవరి 2013: శ్రీ లంక దేశ అధ్యకక్షులు శ్రీ మహీంద రాజపక్సే శనివారం తెల్లవారుఝామున శ్రీవారి సుప్రభాతసేవలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా శ్రీలంక రాష్ట్ర అధ్యకక్షులవారి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలయం లోపల అర్చకస్వాములు శ్రీలంక అధ్యకక్షులవారు మరియు వారి బృందానికి స్వామివారి వైభవాన్ని విపులీకరించారు.
అనంతరం శ్రీ రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రీ రాజపక్సే దంపతులకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి లడ్డూ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటో మరియు ఆధ్యాత్మిక దేవస్థానం ప్రచురణలను బోర్డుసభ్యులు శ్రీ శివప్రసాద్, తిరుమల జె.ఇ.ఓ శ్రీ శ్రీనివాసరాజు మరియు సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌లు అందజేశారు.
అనంతరం శ్రీలంక అధ్యకక్షులు శ్రీరాజపక్సేను తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి సుబ్రహ్మణ్యం, వారు బసచేసివున్న శ్రీకృష్ణ అతిథి భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే, పోలీసు, రెవిన్యూ అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.