Press Release on SOLAR ECLIPSE _ ఈ నెల 22న సూర్యగ్రహణం

Tirupati, July 15, 2009: As per the TTD Panchangam the Solar Eclipse fall at 5.28 am to 7.21 am on July 22.

In view of the Solar Eclipse on July 22, the Temple Doors of Lord Venkateswara, Tirumala will be closed from 9pm on July 21 to 8am on July 22. All morning sevas such as Ekantham and there will be no AAD and Sahasra Kalasabhishekam. Sarva Darshanam will be commenced from 11am on July 22. on July 21 the Ekantha Seva to the Lord will be conducted at 8.30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఈ నెల 22న సూర్యగ్రహణం

తిరుమల, జూలై-15,  2009: తితిదే పంచాంగం ప్రకారం ఈ నెల 22వ తేదిన ఉదయం 5.28 గంటల నుండి  7.21 గంటల వరకు సూర్యగ్రహణం సంభవిస్తుంది.

ఈ సందర్భంగా జూలై 21వ తేదిన రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు జూలై 22వ తేది ఉదయం 8 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

సూర్యగ్రహణం సందర్భంగా జూలై 21వ తేదిన రాత్రి 8.30 గంటలకు శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఏకాంతసేవను నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 22వ తేది ఉదయం 8-8.30 గంటల మద్య ఏకాంతంగా సుప్రభాతం, 8.30-11 గంటల మద్య శుద్ధి, పుణ్యహవచనం,తోమాలసేవ, కొలువు, మొదటి అర్చన, సాతుమొర, శుద్ధి, రెండవ అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ రోజు నిర్వహించాల్సిన సహస్రకళశాభిషేకంను, అర్చన అనంతర దర్శనంను రద్దు చేయడమైనది. అదేవిధంగా సర్వదర్శనం ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.