PREZ OFFERS PRAYERS TO HILL LORD_ శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

Tirumala, 2 Sep 2017: His Excellency the Honourable President of India Sri Ramnath Kovind along with his family and entourage offered prayers in the temple of Lord Venkateswara in Tirumala on Saturday.

The first citizen of India who was on a two day maiden visit to Tirumala followed the temple tradition. He first offered prayers in Bhu Varaha Swamy temple located adjacent to Swami Pushkarini and later reached Tirumala temple.

On his arrival at Mahadwaram along with honourable governor of AP and TS Sri ESL Narasimhan and honourable CM of AP Sri N Chandrababu Naidu, he was welcomed by TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna while the Veda pundits offered Isthikaphal Swagatham to the first citizen of the country with temple honours.

Later he offered prayers in front of Lord Venkateswara along with his spouse smt Savita Kovind, son Sri Pasanth Kumar and daughter Ms Swati. One of the chief priest’s of the temple Dr AV Ramana Dikshitulu explained to the Governor the importance of jewels and of the presiding deity.

Later at Ranganayakula Mandapam, Vedasirvachanam was rendered and teertha prasadams, lamination photo of Lord and Sesha Vastram were presented to the honourable President by TTD EO.

The other protocol VIPs who accompanied President included ministers of AP sri Acchennaidu, Sri Amarrnath Reddy, Sri Kala Venkat Rao.

HH Tirumala Pedda Jiyar Swamy, HH Chinna Jiyar swamy, DIG Sri Prabhakar Rao, District Collector Sri Pradyumna, temple DyEO Sri Kodanda Rama Rao, Reception DyEO Sri Harindranath, OSD Sri Lakshminarayana Yadav and other officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

సెప్టెంబర్‌ 02, తిరుమల 2017: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ దర్శించుకున్నారు. గౌ|| రాష్ట్రపతి వెంట ఆయన సతీమణి శ్రీమతి సవితాకోవింద్‌, కుమారుడు శ్రీ ప్రశాంత్‌ కుమార్‌, కుమార్తె కుమారి స్వాతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు శ్రీ అమరనాథరెడ్డి, శ్రీఅచ్చెన్నాయుడు, శ్రీ కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు.

గౌ|| రాష్ట్రపతి శనివారం ఉదయం 7.00 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ వరహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, రాష్ట్ర డిఐజీ శ్రీప్రభాకర్‌రావు, టిటిడి సివిఎస్వో శ్రీ ఎ.రవికృష్ణ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| రాష్ట్రపతికి టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ ఎ.వి.రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రశస్త్యాన్ని, సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో గౌ||రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో, జెఈవోలు కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయంగార్‌ స్వామి, జిల్లా కలెక్టర్‌ శ్రీప్రదుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్‌పి శ్రీ అభిషేక్‌ మహంతి, డెప్యూటీ ఈవోలు శ్రీకోదండరామరావు, శ్రీహరీంద్రనాథ్‌, ఒఎస్‌డి శ్రీ లక్ష్మీనారయణ యాదవ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.