బూందిపోటులో అగ్నిప్రమాదం అన్నవార్త వాస్తవదూరం-శ్రీవారి ఆలయ డిప్యూటి.ఈ.ఓ

బూందిపోటులో అగ్నిప్రమాదం అన్నవార్త వాస్తవదూరం-శ్రీవారి ఆలయ డిప్యూటి.ఈ.ఓ

సెప్టెంబర్‌ 02, తిరుమల 2017: తిరుమలలో శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందిపోటులో అగ్నిప్రమాదం సంభవించిందని సామాజిక మాధ్యమం (వాట్స్‌అప్‌) లో వచ్చిన వార్తలో వాస్తవం లేదని ఆలయ డిప్యూటి.ఈ.ఓ శ్రీ కోదండరామారావు స్పష్టంచేశారు.

శనివారంనాడు శ్రీవారి బూందిపోటులో అగ్నిప్రమాదం సంభవించిందని సామాజిక మాధ్యమంలో వార్తలు వచ్చాయి. వెంటనే దీనిపై స్పందించిన శ్రీ కోదండరామరావు తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ ఆలయం వెలుపల ఉన్న బూందిపోటులో బూంది తయారు చేస్తున్నప్పుడు సాధారణంగా పొయ్యి నుండి వేడి సెగలు పైకి లేస్తాయన్నారు. ఆ సెగలు పైన ఉన్న చిమ్నిని తాకినప్పుడు ఆ చిమ్నికి అంటుకొని ఉన్న నెయ్యి వ్యర్థం మండింది. అంతేకాని ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించలేదని ఆయన స్పష్టీకరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.