PREZ ON MAIDEN VISIT TO TEMPLE CITY_ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI AT TIRUCHANOOR

Tiruchanur, 1 September 2017: H.E. the Honourable President of India Sri Ramnath Kovind had darshan of Goddess Padmavathi Devi at Tiruchanur on Friday during his maiden visit to temple city along with his family.

On his arrival at the main entrance of the temple along with Honourable Governor of AP and TS Sri ESL Narasimhan and Honourable CM of AP Sri N Chandra Babu Naidu, the TTD Executive Officer Sri Anil Kumar Singhal, Joint Executive Officers Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri A Ravikrishna, temple Special Grade Deputy EO Sri P Munirathnam Reddy had given the delegates warm reception.

While the temple priests welcomed the first citizen of the country with temple honors chanting vedic mantras in a traditional manner. After darshan of the Goddess, Sri Ramnath Kovind was presented with Prasadam of Goddess Sri Padmavathi Devi by TTD EO Sri Anil Kumar Singhal.

The other delegates who were present included ministers of AP Sri Nara Lokesh, Sri Acchennaidu, DIG Sri Prabhakar Rao, Collector Sri Pradyumna, Tirupati Urban SP Sri Abhishek Mohanty.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి వెంట అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌

గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

సెప్టంబర్‌ 1, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి గౌ|| రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు, రాష్ట్రమంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు, శ్రీ నారా లోకేష్‌ ఉన్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| రాష్ట్రపతి దంపతులకు తిరుచానూరు ఆలయ సంప్రదాయపద్దతులలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అర్చక బృందం కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి టిటిడి ఈవో అందించారు.

ఈ కార్యక్రమంలో డిఐజీ శ్రీ ప్రభాకర్‌ రావు, జిల్లా కలెక్టర్‌ శ్రీ పిఎస్‌.ప్రద్యుమ్న, తిరుపతి అర్భన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.