TTD WEBSITE IN TELUGU, TAMIL AND KANNADA SOON- EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో ‘ ముఖ్యాంశాలు

Tirumala, 1 September 2017: To make TTD official web-site more pilgrim-friendly, it will be soon made available even in Telugu, Tamil and Kannada soon, said TTD EO Sri Anil Kumar Singhal.

Before taking the calls from the pilgrim callers during the monthly “Dial your EO” program held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO briefed the pilgrims over the ongoing arrangements for ensuing Brahmotsavams, some of the amendments brought in existing systems following the feed back given by pilgrims and the development activities. He said, the Telugu website trial run will be from September 4 onwards for a week before it is launched officially in a full-fledged manner. “Similarly next month we are planning to launch our Tamil and Kannada versions also. These developments were made following the suggestions from pilgrim folk. This will enable the pilgrims to go for on-line booking for accommodation, darshan, laddu prasadams, donations etc.in an enhanced manner”, he added.

Later EO attended to 25 calls from pilgrims. Answering the callers Sri Srinivasa Rao from Vizag, Smt Nalini from Bengaluru, Smt Kanmani from Chennai, Smt Nagamani, Sri Kishore from Vijayawada who sought to book Suprabhatam and Thomala tickets the EO said, the premiere arjitha sevas are less in number. “So we have introduced electronic online dip system couple of months ago which is yielding good results in a transparent manner. Today also we have released 50,789 tickets of which the premiere sevas includes 6,699 and ordinary sevas are 44,090 for the month of December. So you can book the tickets on-line and the electronic dip will be taken next week”, he added.

Answering callers Smt Lakshmi from Chennai, Sri Umashanker from Hyderabad, the EO said, the new system of limiting Divya Darshan tokens for pedestrian pilgrims to 20thousand a day is giving positive results. “We are now able to provide darshan to 20thousand pilgrims who are coming on foot ways without waiting. We have not stopped Divya darshan pilgrims to 20thousands but limited the tokens to that figure. If the number of pilgrim cross this figure they will have darshan of Lord in Sarva Darshan queue”, EO added.

Reacting to a series of pilgrims Sri Surya Narayana and Sri Rajagopalan from Chennai, Sri Harinath from Hyderabad, Smt Sarvani from Vijayawada, the EO said, some restrictions have been brought in to donor privilege darshan as the pilgrim rush has also increased. However your suggestion providing a separate time slot for donors, giving better darshan to donors who have donated over one Lakh will be negotiated with other officials soon”, the EO said.

Smt Sveta from Australia brought to the notice of EO that she has not received Sapthagiri magazine though she has paid on May she hasn’t received the copy so far for which the EO responded that the copies will be sent to her address immediately by the concerned authority.

When Smt Vidya from Karnataka sought EO for Udayasthamana Seva, he said the Seva was cancelled in 2010 itself.

One pilgrim caller Sri Ramakrishna Paramahamsa from Hyderabad informed EO to further strictly observe traditional dress code for Rs.300 darshan.

Another caller suggested the EO to improve the feature of TTD calendar and diary as the dates are not visible in 2017 calendar for which the EO assured him of improvements in 2018 calendar.

A pilgrim Sri Venkat from Vijayawada suggested EO to deploy Srivari Seva micro observers in Kalyana Katta to avoid the irregularities for which the EO answered his suggestion is well taken.

DECEMBER ONLINE QUOTA OF SEVA TICKETS ARE 50,789-EO

TTD EO Sri Anil Kumar Singhal said a total of 50,789 arjitha Seva tickets were released for the month of December in on-line on Friday.

After Dial Your EO program, the EO briefed media on some important developmental activities. He said among these tickets, the premiere Seva tickets constitute 6,699 which includes Suprabhatam-4,099, Thomala And Archana -60 Each, Astadalapada Padmaradhana-180, Nijapada Darshanam-2,300 while the remaining 44,090 are ordinary arjitha Seva tickets which includes Kalyanotsavam- 10,125, Unjal Seva-2,700, Arjitha Brahmotsavam-5,805, Vasanthotsavam – 11,610, Sahasra Deepalankara Seva-12,350 and Visesha Puja-1,500.

To provide enhanced services to visiting pilgrims with the help of Srivari sevakulu, we are contemplating to introduce four-day, three-day Seva and special occasion sevas also apart from week-long sevas. This decision was taking keeping in view the hardship of educated and employed section to participate in week long Seva. If it is for three days and four days we can anticipate more number of youth and strengthen Srivari Seva also. Our Tirumala JEO has already had a couple of review meetings with concerned department and major user departments. These services may commence in the month of November”, he added.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Special Officer Sri N Muktheswara Rao, CEO SVBC Sri Narasimha Rao, CE Sri Chandrasekhar Reddy and other senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఆన్‌లైన్‌లో 50,789 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 01, తిరుమల 2017: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు సర్వం సిద్ధం :

అఖిలాండకోటి బ్రహ్మూెండనాయకుడైన తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు సర్వం సిద్ధమైందని, అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. డిసెంబరు నెల కోటాకు సంబంధించి మొత్తం 50,789 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. శ్రీనివాస్‌ – తాడేపల్లిగూడెం

ప్రశ్న: పరకామణి సేవను రెండు సార్లు చేశాం. మూడోసారి కంప్యూటర్‌లో బుక్‌ చేస్తుంటే తిరస్కరణ అవుతోంది?

ఈ.వో. ఎక్కువ సంఖ్యలో భక్తులు పరకామణి సేవకు వస్తున్నారు. కావున 90 రోజుల తర్వాత మీరు మరోసారి అవకాశం వస్తుంది.

2. బాలాజీ – తమిళనాడు,

ప్రశ్న: అక్టోబర్‌ మాసంలో తోమాల సేవను ఆన్‌లైన్‌లో టికెట్‌ పొందాం. కానీ టిటిడి అధికారులు తిరస్కరించారు?

ఈ.వో. ఆధార్‌ కార్డు నంబర్‌ తప్పుగా నమోదు చేయడం వల్ల టికెట్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గత మాసంలో దాదాపు 1400 మంది భక్తులు సరైన గుర్తింపు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల తిరస్కరణకు గురయ్యాయి. మీ సమస్యను పరిష్కరించి సరైన వివరాలను పంపుతాం.

3. బాలాజీ కృష్ణమూర్తి – చెన్నై, సెర్వాణి – విజయవాడ, కిషన్‌రావు – వరంగల్‌, హరినాథ్‌ – హైదరాబాద్‌, సూర్యనారాయణ – చెన్నై, రాజగోపాల్‌ – చెన్నె.

ప్రశ్న: టిటిడిలోని పలు స్కీంలకు విరాళాలు అందించాం, దాతలకు ప్రత్యేక దర్శనం కేటాయించాలి, అదేవిధంగా ప్రత్యేకపర్వదినాలైన వైకుంఠఏకాదశి, రథసప్తమి, జనవరి 1వతేది, బ్రహ్మూెత్సవాలలో దర్శనం కల్పించండి, 2018 టిటిడి డైరీలు, క్యాలెండర్లు చెన్నైలో విక్రయించాలి ?

ఈ.వో. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఒక్కరికి త్వరితగతిన సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి కృషిచేస్తోంది. దాతలకు ప్రత్యేక దర్శనం అంశాన్ని పరిశీలిస్తాం.

4. మోహన్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: ఎస్వీబీసీలో ఉదయం ప్రసారమయ్యే శ్రీవారి సేవలలో వ్యాపార ప్రకటనలు లేకుండా ప్రసారం చేయండి?

ఈ.వో. ఈ అంశాన్ని పరిశీలిస్తాం

5. కల్యాణి – చెన్నై, నళిని – బెంగుళూరు, నాగమణి – కంచి, శ్రీనివాసులు -విశాఖపట్నం

ప్రశ్న: ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవల కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులో ఉండటం లేదు ?

ఈ.వో. ఆర్జిత సేవలను పారదర్శకంగా భక్తులకు అందించేందుకు టిటిడి నూతనంగా డిప్‌ విధానం తీసుకువచ్చాం. ఇందులో వారం రోజుల పాటు భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో సేవా టికెట్లు పొందినవారికి ఎస్‌ఎంఎస్‌లు పంపుతాం. అనంతరం మూడు రోజుల వ్యవధిలో రుసుము చెల్లించి భక్తులు టికెట్లు పొందవచ్చు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 90 వేల మందికి పైగా భక్తులు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వారందరికి డిప్‌ విధానంలో లాటరీ తీసి ఆర్జిత సేవలను కేటాయిస్తున్నాం. గతంలో ఈ దర్శన్‌ కౌంటర్లలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపులో పిర్యాధులు వచ్చాయి. ఈ క్రమంలో డిప్‌ విధానం ద్వారా సేవా టికెట్లను కేటాయిస్తున్నాం.

6. దేవి – జమ్మలమడుగు

ప్రశ్న: దివ్యాంగుల దర్శనానికి భార్యభర్తలు, పిల్లలను అనుమతించండి.?

ఈ.వో. దివ్యాంగుల సౌలభ్యం కోసం ఒక సహాయకున్ని అనుతిస్తున్నాం. అదే విధంగా నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేకదర్శన అవకాశాన్ని కల్పిస్తున్నాం.

7. ఈశ్వరరెడ్డి – రావులపాలెం

ప్రశ్న: రోజువారి సేవల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించండి?

ఈ.వో. రోజుకు సరాసరి 90 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లను మా అధికారులు పరిశీలించాక చర్యలు తీసుకుంటాం.

8. లక్ష్మీ – చెన్నై

ప్రశ్న: దివ్యదర్శనం భక్తులకు దర్శనం టికెట్లు పెంచండి, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు అందడం లేదు.?

ఈ.వో. అలిపిరి మెట్ల మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేలు కలుపుకుని మొత్తం రోజుకు 20 వేల టికెట్లను, ప్రత్యేకప్రవేశ దర్శనం (రూ.300) 20 వేల టికెట్లను ప్రతి రోజూ జారీ చేస్తున్నాం. తద్వారా భక్తులు నిర్ణీత సమయంలో సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. త్వరలో సర్వదర్శనం భక్తులకు స్లాట్‌ విధానం ద్వారా దర్శనం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాం.

9. రామకృష్ణ – హైదరాబాద్‌

ప్రశ్న: డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని నెలకోసారి ప్రవేశపెట్టడం వల్ల లైన్లు కలవడం లేదు, కావున వారానికి ఒకసారి నిర్వహించగలరు. పోటులో లడ్డూ తయారీలో వస్తున్న పొగ వల్ల శ్రీవారి ఆలయ ఆనందనిలయం పాడవుతోంది. తిరుమలలో పూలు ధరించకుండా, సంప్రదాయ దుస్తులు ధరించేలా, అన్నప్రసాద భవనం వద్ద పాన్‌ విక్రయాలు చేయకుండా, వివిఐపిలు శ్రీవారి దర్శనానికి వచ్చేముందు సామాన్య భక్తులకు సమాచారం తెలియజేయండి ?

ఈ.వో. మీ సూచనలు బావున్నాయి. ఈ మెయిల్‌ను స్వయంగా పరిశీలిస్తున్నా. ఫోన్‌లు కలవని పక్షంలో ఈ మెయిల్‌ ద్వారా లేదా చరవాణి ద్వారా లేదా నేరుగా వచ్చి సూచనలు, సలహాలు ఇచ్చినా మీ సూచనలపై తగు చర్యలు తీసుకుంటాం.

10. శ్వేత – ఆస్ట్రేలియా

ప్రశ్న: సప్తగిరి మాస పత్రికకు చందా చెల్లించాం. కానీ జూన్‌, జూలై, ఆగష్టు సంచికలు అందలేదు?

ఈ.వో. మీ సూచన చాలా బావుంది. సప్తగిరి మాస పత్రికను క్రమం తప్పకుండా అందెలా చర్యలు తీసుకుంటాం.

11. వెంకట్‌ – విజయవాడ

ప్రశ్న: లడ్డూ ప్రసాద సేవకులకు రాంబగీఛలో వసతి ఏర్పాటు చేయండి. శ్రీవారి సేవా సదన్‌లో కేటాయించడం వల్ల రావడానికి, దూరం కావడం వల్ల పాదరక్షలు లేకుండా నడవడం కష్టంగా ఉంది. భక్తులకు తిలకధారణ సరిగా జరుగడంలేదు. కల్యాణకట్టలో క్షురకులపై మరింత నిఘా పెంచండి. ?

ఈ.వో. శ్రీవారి సేవకులకు నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. కొత్త భవనంలో శ్రీవారి సేవకులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాం. భక్తుల అభిప్రాయాలను సేకరించి మీరు ఇచ్చిన సలహాలపై నిర్ణయం తీసుకుంటాం.

12. కిషోర్‌ – విజయవాడ

ప్రశ్న: టిటిడి ఈ దర్శన్‌ కౌెంటర్‌లో ఆర్జిత సేవా టికెట్ల విక్రయాలను పునరుద్దరించండి.?

ఈ.వో. గతంలో ఈ దర్శన్‌ కౌంటర్ల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను విక్రయించడం ద్వారా భక్తులు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పారదర్శకంగా సేవా టికెట్లను కేటాయించేందుకు ఇటీవల ఆన్‌లైన్‌ డిప్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ. రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌. ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీరవీంద్రారెడ్డి, శ్రీమతి విమలకుమారి, అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2017 శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు :

– కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు కన్నులపండుగగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. మరో వారం రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తాం.

– బ్రహ్మూెత్సవాల్లో ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేశాం.

– భక్తుల రద్దీకి తగ్గట్టు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటుచేస్తాం.

– గరుడ సేవ నాడు తిరుమలకు ద్విచక్రవాహనాలు నిషేధించడమైనది.

– 3 వేల మంది శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తారు.

– శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా స్వామివారి వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం.

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు :

– డిసెంబరు నెల కోటాకు సంబంధించి మొత్తం 50,789 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తాం.

– ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 6,699 సేవా టికెట్లు విడుదల చేస్తున్నాం. ఇందులో

సుప్రభాతం 4,099, తోమాల 60, అర్చన 60, అష్టదళపాద పద్మారాధన 180,

నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయి.

అదేవిధంగా, ఆన్‌లైన్‌లో 44,090 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో కల్యాణోత్సవం 10,125, ఊంజల్‌ సేవ 2,700, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,805, వసంతోత్సవం 11,610, సహస్రదీపాలంకార సేవ 12,350, విశేష పూజ 1500 టికెట్లు ఉన్నాయి.

తెలుగులో TTD seva online.com :

– ఈ నెలలో టిటిడి seva online.comను తెలుగులో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే త్వరలో తమిళ, కన్నడ భాషల్లోనూ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

శ్రీవారి సేవ :

– శ్రీవారి సేవలో నూతన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం శ్రీవారి సేవకులు వారం రోజుల పాటు సేవలందిస్తున్నారు. యువత, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు నూతనంగా 3 రోజులు, 4 రోజులు, ప్రత్యేక సందర్భాలలో శ్రీవారి సేవకులకు స్లాట్‌లను ప్రవేశపెడుతున్నాం. ఈ విధానం ద్వారా నవంబరు నెల నుండి భక్తులకు సేవలందించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.