PRIORITY TO AYURVEDA R&D -HRD EX DG SRI CHAKRAPANI _ ఆయుర్వేద ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి _ హెచ్ఆర్‌డి మాజీ డైరెక్టర్ జనరల్ శ్రీ చక్రపాణి

Tirupati,20 April 2022: Former Director-General of Human Resources Development, Sri D Chakrapani on Wednesday called upon students, teachers, and researchers in the Ayurveda stream to focus on and prioritize Research and development for the betterment of the society.

Addressing Ayurveda students after a visit to the Sri Venkateswara Ayurveda College on Wednesday evening, the visiting dignitary urged them to utilize the Government Research Institutions for the sake of Ayurveda medical research and procure international recognition for their research works.

Emphasizing the need for basic research and the spread of Ayurveda medicine in rural areas, he lamented that the present system did not promote the spread of Ayurveda in rural areas. He urged Ayurveda students to adopt villages and spread awareness and its significance among the rural population.

He also exhorted them to coordinate with Allopapathy doctors who are enthusiastic to promote Ayurveda research to achieve quality results faster.

Dr. Murali Krishna, the Principal of SV Ayurveda College highlighted the research works done by PG students in coordination with SV veterinary University.

Vice-Principal Dr. Sundaram, Dr. Sunila, and a large number of students were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయుర్వేద ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి –

హెచ్ఆర్‌డి మాజీ డైరెక్టర్ జనరల్ శ్రీ చక్రపాణి

తిరుపతి, 2022 ఏప్రిల్ 20 ; ఆయుర్వేద వైద్య విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ శ్రీ డి.చక్రపాణి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఆయుర్వేద వైద్య పరిశోధనల కోసం ప్రభుత్వ పరంగా పరిశోధనా సంస్థలను ఉపయోగించు కుని తాము చేసే పరిశోధనలను అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న మౌలిక అంశాలపై పరిశోధన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యం అవసరం ఎంతో ఉందని, అయితే ప్రస్తుత వ్యవస్థలో ఈ సేవలు గ్రామీణ ప్రాంతాలకు అందాల్సిన స్థాయిలో చేరడం లేదన్నారు. విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకుని కొద్దికాలం పాటు అక్కడే ఉండి ఆయుర్వేద వైద్య శాస్త్రంపై ప్రజలకు అవగాహన పెంచి ఈ వైద్యం వైశిష్ట్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని శ్రీ చక్రపాణి కోరారు.

ఎంతో మంది అల్లోపతి వైద్యులు ఆయుర్వేదం మీద అభిమానం పెంచుకుని పరిశోధనలు చేయాలనే ఉత్సాహంతో ఉన్నారని ఆయన తెలిపారు. అలాంటి వారితో సంయుక్తంగా పరిశోధనలు చేయడం ద్వారా పరిశోధనల సమయం తగ్గి, నాణ్యమైన ఫలితాలు పొందవచ్చునని సూచించారు. ఆయుర్వేద కళాశాల పీజీ విద్యార్థులు స్విమ్స్, ఎస్వీయు, వెటర్నరీ యూనివర్సిటీలతో కలిపి చేస్తున్న పరిశోధనల గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ వివరించారు.

వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, డాక్టర్ సునీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.