PRIORITY TO RITUALS AND PILGRIMS-EO_ టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు

Tirupati 15 August 2018 : The top most priorities of TTD is to ensure rituals as per Agamas and provide hassle free darshan to pilgrims, said TTD EO Sri Anil Kumar Singhal.

During his Independence Day address in the Parade Grounds of TTD administrative building in Tirupati on Wednesday, the EO the great sacrifices made by the National leaders for the sake of free India.

Later he briefed on the various developmental programmes taken up by TTD in the areas social, religious, educational, medical and pilgrim amenities.

“The time slot darshan introduced by TTD has reduced the woes of long waiting hours of pilgrims in queue lines and compartments. Today we are providing time slot darshan to nealy 60-70 thousand Pilgrims without any inconvenience”, he maintained.

The EO focussed on the Srivari temples which are coming up in Amaravathi, Kanyakumari and the one which was opened recently in Kurukshetra.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు

ఆగస్టు 15, తిరుపతి, 2018 ; తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్‌రావు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 21 మంది అధికారులు, 136 మంది ఉద్యోగులు, 34 మంది ఈ ఏడాది పదవి విరమణ పొందే ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులచే జాతీయగీతం, స్వచ్ఛబారత్‌పై కూచిపూడి నృత్యం, శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ”తొలిపొద్దు వెలుగులు”, ఎస్‌జిఎస్‌ హైస్కూల్‌ విద్యార్థులు ” వృక్షో రక్షతి రక్షిత: ” దాస భక్తి గీతాలు ఆకట్టుకుంది. ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్వీ వెటర్నరి కళాశాల ఎన్‌సిసి విద్యార్ధిని విద్యార్థుల గుర్రపుస్వారీ అలరించింది.

అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన టిటిడి ఉద్యోగుల పిల్లలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను టిటిడి అధికారులు అందించారు. ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన వారికి రూ.2,116/-, పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.1,116/- నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండళి సభ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ఇన్‌చార్జ్‌ సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, న్యాయాధికారి శ్రీ ఎం.వి.రమణ నాయుడు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి శ్రీ ఓ.బాలాజి, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ సుబ్రమణ్యం, ఇతర విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.