ASTABANDHANA SAMARPANA CARRIED OUT IN TIRUMALA TEMPLE_ ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ

Tirumala, 14 August 2018: On the third day of the ongoing five day fete of Astabandhana Balalaya Maha Samprokshanam fete, (excluding Ankurarpanam day) Astabandhana Samarpana was observed on Tuesday.

The celestial fete was carried out between 5.30am and 9am in the temple. Astabandhana Choornam, the paste prepared out of eight ingredients was applied to Padma Peetham (pedestal) where the presiding deity is standing, Vishwaksena, Garudalwar, Bhashyakarulavaru, Yoga Narasimha, Varada Raja Swamy, Potu Tayaru.

EO, JEO INSPECTS VIMANAM SUDDHI WORKS

TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the Suddhi works of Ananda Nilayam Vimanam and Dhwaja Sthambham on Tuesday.

A new silver Makara Toranam (Threshold) worth Rs.1.75 lakhs was decked to Vimana Venkateswara Swamy in Ananda Nilayam.

Eleven new Gold plated leaves were attached to Dhwajasthambha Sikharam worth Rs.1.50lakhs and a circular ring worth Rs.4lakhs placed between Peetham and Sthambham.

On August 15, there will be Ksheeradhivasam in Srivari temple between 5.30am and 8am.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ

ఆగస్టు 14, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన శ్రీ గరుడాళ్వార్‌, పోటు తాయార్లు, శ్రీవరదరాజస్వామి, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ విష్వక్సేన, శ్రీ భాష్యకార్లు, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు.

ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులను పరిశీలించిన ఈవో, జెఈవో :

శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులను మంగళవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు రూ.1.5 లక్షలు విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు రూ.4 లక్షలు విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వరస్వామివారికి అలంకరించేందుకు రూ.1.75 లక్షలు విలువైన వెండి మకరతోరణాన్ని టిటిడి సిద్ధం చేసింది. వీటి ఏర్పాటు పనులను ఈవో, జెఈవో పరిశీలించారు.

ఆగస్టు 15న మహాశాంతి పూర్ణాహుతి :

అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా ఆగస్టు 15న బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, ఆ తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీగురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.