Procession of Muthyalu Talamralu in connection with ‘SEETHA RAMA KALYANAM’ _ ముత్యాలహారముల ప్రదర్శన

Tirupati, 04 April 2009: TTDs Executive Officer Dr. K.V.Ramanachary is took part in Muthyalu Talambralu and Vastram in a procession from TTD Administrative Building to Sri Kodanda Rama Swamy Temple on April 4 in connection with Seetha Rama Kalyanam.
 
Local Temples DyE.O Sri Vasudevan, Addl C.V&S.O Sri Sivakumar Reddy, Chief Accounts Officer Sri O.Balaji, Chief Public Relations Officer Sri K.Ramapulla Reddy, Sri T.Ravi P.R.O and others took part in the procession.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యాలహారముల ప్రదర్శన

తిరుపతి, ఏప్రిల్‌-4, 2009: శ్రీరామనవమి సందర్భంగా శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏఫ్రిల్‌ 5వ తేదిన సాయంత్రం 7 నుండి 8 గంటల మధ్య నిర్వహించనున్న శ్రీసీతారామకల్యాణమునకుగాను తితిదే పరిపాలనాభవనం నుండి సాయంత్రం 5.30 గంటలకు ముత్యాలహారములను ప్రదర్శనగా శ్రీకోదండరామస్వామివారి ఆలయానికి తీసుకెళ్ళారు. తితిదే డైరీఫారంనకు చెందిన గజములు ముందు నడువగా అర్చకస్వాములు ముత్యాలహారములను ఆలయానికి తీసుకెళ్ళారు. ఈసందర్భంగా తితిదే ఇ.ఓ. డా|| కె.వి.రమణాచారి ఖజనా విభాగంలో ప్రత్యేకపూజలో పాల్గొని ఈ ముత్యాలహారములను అర్చకస్వాములకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే అదనపు భద్రతాధికారి మేజర్‌ శివకుమార్‌ రెడ్డి, స్థానికాలయాల డిప్యూటి ఇ.ఓ, శ్రీవాసుదేవన్‌, గణాంకశాఖాధికారి శ్రీఓ.బాలాజీ, అర్చకస్వాములు, భజనబృందాల భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.