PROCESSION OF SWARNA RATHAM HELD _ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

TIRUMALA, 02 JANUARY 2023: In connection with Vaikuntha Ekadasi on Monday, the procession of Swarna Ratham was held at Tirumala.

The deities of Malayappa along with Sridevi and Bhudevi were taken on a celestial ride on the golden chariot which was pulled by devotees especially women.

The women employees of TTD have also participated in the chariot pulling with enthusiasm.

The devotees chanted Govinda… Govinda with religious ecstasy while the mammoth carrier was marching all along the mada streets.

Board members Smt Mallieswari, Sri Madhusudan Yadav, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

తిరుమల, 02 జనవరి 2023: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టిటిడి మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.