PROCESSION OF SWARNA RATHAM HELD _ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

Tirumala, 13 Jan. 22: As part of Vaikuntha Ekadasi festivities, the procession of Swarna Ratham was held in Tirumala with utmost religious fervour on Thursday.

The women devotees including 200 women employees of TTD pulled the finely decked mammoth golden chariot with devotion chanting Govinda Govinda.

The Ratham glided swiftly along the four Mada streets even as the devotees who assembled in the galleries were immersed in Bhakti.

The Honourable CJI Justice NV Ramana, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri SV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, HO Dr Sridevi, Welfare Officer Sri Damodaram and other officials were also present.

Meanwhile the Vaikuntha Dwara darshan for common devotees commenced by 7:30am in Srivari temple on this auspicious occasion.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

 తిరుమల, 13 జ‌న‌వ‌రి 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.

సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వెల్ఫేర్ డిప్యూటీ ఈఓ శ్రీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఏడున్నర గంటలకు సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.