PROHIBITED ITEMS CAUGHT AT ALIPIRI CHECK POST _ అలిపిరి టోల్‌గేట్‌లో మద్యం, మాంసం స్వాధీనం
Tirupati, 13 May 20: The Vigilance sleuths of TTD have caught hold of prohibited items in a vehicle during their routine frisking at Alipiri Check post on Wednesday.
A person was caught red handedly by SI Sri Siva and CT Sri Ramudu while carrying Chicken (5 kg), Four Signature Whisky bottles, Two bottles of Vodka, 2000ml loose liquor under the front seat.
The accused is handed over to to CI in Two Town Police Station at Tirumala for necessary action.
Another case was already pending against the same person which was booked some time ago.
According to Vigilance Officer of TTD Sri Prabhakar, while frisking, the person is also found having a Video Journalist Identity Card.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అలిపిరి టోల్‌గేట్‌లో మద్యం, మాంసం స్వాధీనం
తిరుమల, 2020, మే 13: అలిపిరి టోల్‌గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో శ్రీ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత పదార్థాలను తిరుమలకు తీసుకెళుతుండడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
తిరుపతికి చెందిన శ్రీ ఎన్.వెంకటముని కారులో తిరుపతి నుండి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ముందు సీటు కింది భాగంలో నిషేధిత పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల చికెన్, సిగ్నేచర్ విస్కీ – 4 బాటిళ్లు, ఓట్కా – 2 బాటిళ్లు, లూజ్ లిక్కర్ – 2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, శ్రీ వెంకటమునిపై గతంలో నమోదైన ఒక కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
తనిఖీ సందర్భంగా సదరు వ్యక్తి వద్ద వీడియో జర్నలిస్టు పేరిట ఉన్న గుర్తింపు కార్డును గుర్తించామని టిటిడి విఎస్‌వో శ్రీ ప్రభాకర్ తెలిపారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.