PROPER UTILISATION OF SEVAKULU WILL ENHANCE QUALITY OF SRIVARI SEVA-EO_ శ్రీవారిసేవకుల ద్వారా భక్తులకు మెరుగైన సేవలందించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 23 February 2018: To extract qualitative services from Srivari Sevakulu, rationalisation will help to enhance their services, said, TTD EO Sri Anil Kumar Singhal.
A three-hour long review meeting by EO along with Tirumala JEO Sri KS Sreenivasa Raju on Srivari Seva services utilisation by user departments was held at Annamaiah Bhavan in Tirumala on Friday.
After power point presentation by Vigilance, Annaprasadam, Temple and other departments, the EO has studied department wise requirement of sevakulu for normal and peak days. “We want qualitative services from sevakulu and not quantitative. The rationalisation by all the user departments will help to extract qualitative services from sevakulu”, he said.
The EO also directed the PRO to widely publicize individual online registration of Srivari Seva for three day and four day services also to encourage educated and employed youth, NRIs etc. to take part in service through promos in SVBC.
CVSO Sri A Ravikrishna, DyEOs Sri Harindranath, Sri Sreedhar, Sri Balaji, Smt Nagaratna, Health Officer Dr Sharmista, VSO Sri Ravindra Reddy, SO Sri Venugopal, PRO Dr T Ravi were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీవారిసేవకుల ద్వారా భక్తులకు మెరుగైన సేవలందించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల, 2018 ఫిబ్రవరి 23: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాదిగా విచ్చేసే భక్తులకు శ్రీవారిసేవకుల ద్వారా మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి శ్రీవారిసేవపై 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలోని అన్ని విభాగాలలో శ్రీవారి సేవకుల ద్వారా మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగతంగా 3 రోజులు, 4 రోజుల శ్రీవారిసేవ స్లాట్ కొరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశం గురించి ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా||టి.రవిని ఆదేశించారు. విద్యావంతులు, యువత, ప్రవాస భారతీయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో శ్రీవారిసేవకు రావాలన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, విజిలెన్స్, కల్యాణకట్ట, వసతి, ఆరోగ్య విభాగం, ఇతర విభాగాలలో సాధారణ రోజులు, రద్దీ రోజులలో శ్రీవారిసేవకుల వినియోగాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాధ్, శ్రీశ్రీధర్, శ్రీ బాలాజి, శ్రీమతి నాగరత్న, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ఠ, విఎస్‌వో శ్రీరవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.