PROVIDE ADVANCED ELECTRONIC GADGETS TO ALL EDUCATIONAL INSTITUTIONS BY NEXT ACADEMIC YEAR-TTD EO_ టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఆధునిక వ‌స‌తుల‌తో కంప్యూట‌ర్ ల్యాబ్‌లు, గ్రంథాల‌యాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 15 Oct. 19: TTD EO Sri Anil Kumar Singhal on Tuesday directed the officials concerned to provide advanced version of computers and other electronic gadgets useful for the pupils in all the TTD educational institutions by next academic year.

During the Internal Audit meeting held at the Conference Hall in TTD Administrative Building in Tirupati on Tuesday evening, the EO said, the students should improve their academic skills by best utilizing these gadgets, he opinioned.

Later, he directed the officials of the publications wing of TTD to print more books that depict the glory of Tirumala history and laurels of Sri Venkateswara Swamy as there is a huge demand among the public from all corners of the country as well across the globe. A catalog of all TTD publications need to be displayed on our website for the information of the devotees along with barcoding”, he added. 

He also instructed the concerned to avoid wastage of paper in TTD Press. Later he directed the IT wing to come out with an exclusive application on Hospital Management and to levy penalty on the drug supplying companies if they violate the guidelines.

The EO directed the JEO Sri P Basant Kumar to organise video conference with the staff concerned in a regular way to monitor the activities pertaining to various TTD Information Centres located at Bengaluru, Chintamani, Hosur, Bangaru Tirupati in Karanataka. The information updates with respect to TTD Trusts and Schemes, Tirumala updates etc.should be made available in all these centres”, he maintained. 

CVSO Sri Gopinath Jatti, Auditors Sri Narasimha Murthy, Sri Sarat, FACAO Sri Balaji, Additional FACAO Sri Raviprasadudu, CAO Sri Sesha Sailendra and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఆధునిక వ‌స‌తుల‌తో కంప్యూట‌ర్ ల్యాబ్‌లు, గ్రంథాల‌యాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 అక్టోబరు 15:  టిటిడి విద్యాసంస్థ‌ల్లో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే లోపు ఆధునిక వ‌స‌తుల‌తో కంప్యూట‌ర్ ల్యాబ్‌, గ్రంథాల‌యాలు, విద్యార్థుల‌కు స‌రిప‌డా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అంత‌ర్గ‌త ఆడిట్ క‌మిటీ స‌మావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ యాత్రికుల కోరిక మేర‌కు శ్రీ‌వారి ప్రాశ‌స్త్యాన్ని, ఆల‌య చ‌రిత్ర‌ను తెలిపేలా మ‌రిన్ని పుస్త‌కాలను  ముద్రించి అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఆన్‌లైన్‌లో అన్ని పుస్త‌కాల సంక్షిప్త స‌మాచారంతో కేట‌లాగ్ రూపొందించాల‌న్నారు. ప్ర‌తి పుస్త‌కానికి బార్‌కోడింగ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, పుస్త‌కాల కాల‌ప‌రిమితిని బ‌ట్టి ధ‌ర‌లు నిర్ణ‌యించేలా, డిస్కౌంట్ ఇచ్చేలా విధి విధానాలు రూపొందించాల‌ని జెఈవోకు సూచించారు. టిటిడి ప్రెస్‌లో పుస్త‌కాల ముద్ర‌ణ స‌మ‌యంలో పేప‌రు వృథాను అరిక‌ట్టాల‌న్నారు. టిటిడిలో ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని, మందుల స‌ర‌ఫ‌రాలో నిబంధ‌న‌లు ఉల్లంఘించే సంస్థ‌లకు జ‌రిమానా విధించాల‌ని ఆదేశించారు.

బెంగ‌ళూరు, హైద‌రాబాద్, ముంబ‌యిలోని స‌మాచార కేంద్రాలు, చింతామ‌ణి, హోసూరు, బంగారు తిరుప‌తిలోని క‌ల్యాణ‌మండ‌పాల వ‌ద్ద ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌, శ్రీ‌వారి డాల‌ర్లు, ప్ర‌చుర‌ణ‌ల‌ విక్ర‌యం, భ‌క్తుల‌కు సంబంధించిన ఇత‌ర అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు అక్క‌డి అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని జెఈవోను కోరారు. ఈ ప్రాంతాల్లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని, ట్ర‌స్టులు, స్కీముల వివ‌రాల‌ను క‌ర‌ప‌త్రాల రూపంలో ముద్రించి అందుబాటులో ఉంచాల‌న్నారు.  స్థానికాల‌యాల‌తోపాటు ఉద్యాన‌వ‌న‌, గోశాల‌, ఆరోగ్య త‌దిత‌ర విభాగాల్లో బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇఆర్‌పి విధానాన్ని అమ‌లు చేయాల‌న్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ప్రముఖ ఆడిటర్లు శ్రీ నరసింహమూర్తి, శ్రీ శరత్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, అద‌న‌పు ఎఫ్ఏ, సిఏవో శ్రీ రవిప్రసాదు, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.