“PROVIDING TRANSPARENT AMENITIES WITH ZERO FAIL SYSTEM IS OUR ULTIMATE GOAL”- TIRUMALA JEO_ సంపూర్ణ పారదర్శకతే మా లక్ష్యం : తిరుమల జె.ఈ.ఓ

Tirumala, 25 July 2017: “Providing best possible amenities to the pilgrims with transparency and with zero defect system is the ultimate motto of TTD, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The JEO organised weekly review meeting with various HoDs on the various developmental activities at Annamaiah Bhavan in Tirumala. Later speaking to media persons, the JEO briefed them that the recent initiatives introduced by TTD are yielding good results. “The token system for allotment of rooms at CRO is garnering huge response from the pilgrims. On July 22 we have alloted 2948 rooms while on Sunday on July 23 about 3072 rooms were allotted with utmost transparency. All our wings including vigilance, reception, IT, PRO, Srivari Seva volunteers have been rendering best services to stabilise the system to ensure cent percent results and the result is the achievement. We still have some technical glitches which will be overcome soon”, he maintained.

Speaking on the Divya Darshan token system, the JEO said, From July 17 onwards, TTD has introduced the tokens for pedestrian pilgrims limiting it to 20000 a day which includes 14000 tokens at Alipiri and 6000 tokens at Srivarimettu. “About 1.5lakh pilgrims had a very comfortable time slot darshan in the last eight days through this system. Additional token issuing counters will be arranged at Galigopuram and Srivarimettu soon”, he added.

The JEO also said, the simultaneous in and out lines being maintained at Vedivakili has given way for a hassle free darshan to pilgrims. “Now in an hour about 5300 devotees can have a convenient darshan. The two lines near theertham system is also yielding positive results”, JEO informed.

APPEAL TO PARENTS

Over the alleged missing of a seven year old girl child in Tirumala a couple of days ago, the JEO said both the TTD vigilance and police have already sent their teams to Vellore in Tamilnadu as it was suspected that an unidentified woman took the girl along with her in Vellore enroute bus as per the evidence of CCTV footage.

“Tirumala being a place of heavy human activity with scores of pilgrims swarming to the hill town, I appeal to the parents to take care of their kids and please do not leave them alone”, he urged.

JEO INSPECTS AGED LINE

Earlier Tirumala JEO Sri KS Sreenivasa Raju has inspected the specially challenged and aged people darshan token issuing centre locating opposite SV Mueseum in Tirumala on Tuesday.

He also verified the token issuing system, functioning of battery cars pressed into service for this category pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సంపూర్ణ పారదర్శకతే మా లక్ష్యం : తిరుమల జె.ఈ.ఓ

జూలై 25, తిరుమల, 2017 : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు వసతి సౌకర్యం, దర్శన ఏర్పాట్లను కల్పించడంలో సంపూర్ణ పారదర్శకతను తీసుకురావడమే తి.తి.దే అంతిమ లక్ష్యమని తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు.

మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తి.తి.దే సీనియర్‌ అధికారులతో ఆయన విభాగాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తి.తి.దే ఇటీవల సామాన్య భక్తుల కొరకు ప్రవేశపెట్టిన వసతి కల్పనలోను, స్వామివారి దర్శనంలోనూ భక్తులకు ఉపకరించే విధంగా కొన్ని మార్పులు తీసుకువచ్చిందని, అవి ఎంతగానో సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా జూలై 12వ తారీఖున తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో ప్రవేశపెట్టిన టోకెన్‌ విధానం, జూలై 17వ తారీఖు నుండి కాలిబాట భక్తులకు రోజుకు 20 వేలకు పరిమితం చేస్తూ ప్రవేశపెట్టిన దర్శన టోకెన్‌ విధానం సత్ఫలితాలనిస్తోందన్నారు. సి.ఆర్‌.ఓలో తీసుకువచ్చిన నూతన విధానంలో గదుల కేటాయింపు జూలై 22న 2,948 మంది భక్తులు వినియోగించుకోగా, జూలై 23న 3,072 మంది భక్తులు నేరుగా టోకెన్‌ పొంది ఎటువంటి ఇబ్బంది లేకుండా గదులు పొందగలిగారన్నారు. ఇప్పటికీ ఈ గదుల కేటాయింపు విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడూ తలెత్తుతున్నాయని, వాటన్నింటినీ త్వరలోనే అధిగమించి, సంపూర్ణ పారదర్శకతతో సేవలందిస్తామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం శ్రీవారి ఆలయం లోపల వెండి వాకిలి చెంత తీసుకువచ్చిన ఒకేసారి ఇన్‌ అండ్‌ ఔట్‌ దర్శన విధానం సత్ఫలితాలనిస్తోందన్నారు. ప్రస్తుతం అమలులో వున్న ఈ విధానం ద్వారా గంటకు 5,300 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించగలుగుతున్నామన్నారు. అదేవిధంగా ఆలయం లోపల భక్తులకు తీర్థాన్ని కూడా రెండు లైన్లలో అందిస్తున్న కారణంగా ప్రశాంతంగా తీర్థం పొందుతున్నారన్నారు. ఈ నెల 17న తి.తి.దే ప్రవేశపెట్టిన దివ్యదర్శనం టోకెన్‌ విధానం కూడా మంచి ఫలితాలనిస్తోందన్నారు. ప్రతిరోజూ అలిపిరి మార్గంలో 14 వేల మంది భక్తులకు టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 4 వేల మంది భక్తులకు టోకెన్‌లు అందిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత వచ్చిన భక్తులను సర్వదర్శనంలో పంపుతున్నట్టు వివరించారు. గతవారం రోజుల సమయంలో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు రెండు గంటల లోపే స్వామివారిని దర్శించుకోవడం విశేషమన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ కోదండరామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పిల్లల విషయంలో తల్లితండ్రులు కూడా జాగ్రత్త వహించాలి : జెఈవో

భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న తిరుమలలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు విజ్జప్తి చేశారు.

జెఈవో మంగళవారంనాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రెండురోజుల క్రితం 7 సంవత్సరాల బాలిక తిరుమలలో కనిపించకుండాపోయిన సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఒక మహిళ బాలికను వేలూరుకు తీసుకెళ్లినట్టు సిసిటివి ఫుటేజి ద్వారా గుర్తించామని, ఇప్పటికే తితిదే విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు బృందాలుగా ఏర్పడి తిరుమల, తమిళనాడులోని వేలూరులో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కౌంటర్‌ పరిశీలన

తిరుమలలో ఎస్వీ మ్యూజియం ఎదుట ఏర్పాటుచేసిన వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల జారీ కౌంటర్‌ను జెఈవో తనిఖీ చేశారు. టోకెన్ల జారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన బ్యాటరీ వాహనాలను పరిశీలించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.