TONDAMANADU TEMPLE PAVITROTSAVAMS_ ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

Tirupati, 25 July 2017: Pavitrotsavams will be observed in Lord Sri Venkateswara temple located at Tondamanadu near Sri Kalahasti from August 4-7.

On first day Pavitra Pratishta, second day Pavitra Samarpana and on final day Pavitra Vitarana will be performed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 జూలై 25: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 4వ తేదీ శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం, వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపడతారు. అనంతరం పవిత్ర అధివశం జరుగనుంది.

ఆగస్టు 5న ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పవిత్ర ప్రతిష్ఠ, మధ్యాహ్నం 3 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

ఆగస్టు 6న ఉదయం 11.30 గంటలకు పవిత్ర సమర్పణ, మధ్యాహ్నం 3 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ చేపడతారు.

ఆగస్టు 7న ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట నడుమ పవిత్ర వితరణ చేపడతారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయం తలుపులు మూసివేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.