PUBLICIZE SARVA DARSHAN TOKEN SYSTEM -TIRUMALA JEO _ సర్వదర్శనం టోకెన్లపై మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి:టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 14 May 2018: The Sarva Darshan Token system introduced by TTD has garnered massive response from pilgrims and still more publicity is needed for the same, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

A review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Monday on the functioning of Sarva Darshan Token sytem. Speaking on this occasion he said, on Sunday itself over 45thousand SD tokens have been issued to the pilgrims, which is a record in the History of TTD”, he informed.

He directed the Engineering wing to display more boards at the pilgrim congregation areas in Tirumala to inform the pilgrim public. He also instructed the concerned to take up wide publicity in Tirupati so that the purpose of SD token system is served.

CE Sri Chandrasekhar Reddy, CVSO In-charge Sri Sivakumar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Sri Venkateswarulu, GM Sri Sesha Reddy, CMO Sri Nageswara Rao and other senior officers also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వదర్శనం టోకెన్లపై మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మే 14, తిరుమల, 2018 ;టిటిడి ఇటీవల ప్రవేశపెట్టిన సర్వదర్శనం టోకెన్‌ విధానంపై భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని, అయితే ఈ విధానంపై మరింత విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది భక్తులకు చేరువకావాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులకు సూచించారు. సర్వదర్శనం టోకెన్‌ విధానం అమలుపై సోమవారం జెఈవో తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆదివారం 45 వేల సర్వదర్శనం టోకెన్లను భక్తులకు జారీ చేశామని, టిటిడి చరిత్రలో ఇది రికార్డు అని తెలిపారు. తిరుమలలో భక్తులు సంచరించే ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని ఫ్లెక్సీ బోర్డులు ప్రదర్శించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై తిరుపతిలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, సిఎంవో డా|| నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.