TPT JEO REVIEWS SRI GT BTU _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించాలి : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 14 May 2018: As the annual Brahmotsavams of Sri Govinda Raja Swamy temple are scheduled from May 21 to 29, Tirupati JEO Sri P Bhaskar reviewed with various department HoDs n the arrangements for the same.

The review meeting was held in the temple premises in Tirupati on Monday evening. Directing the officers, the JEO said all the arrangements should complete by May 18.

He instructed the Annaprasadam officials to distribute anna prasadam, buttermilk to the pilgrims during Vahana sevas. He also directed to erect giant screens at all the core points to ensure pilgrims to watch the procession of vahanams.

He also reviewed on security measures, traffic regulations during Garuda Seva and Rathotsavam, deployment of Srivari Sevakulu etc. The JEO instructed to take up publicity campaign in nearby villages though Prachara Ratham.

DyEOs Smt Varalakshmi, Sri Venkataiah and other officers were also present


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించాలి : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్‌

మే 14, తిరుపతి, 2018 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 21 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్స‌వాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్స‌వాల ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 21న ధ్వజారోహణం, మే 25న గరుడ వాహనం, మే 28న రథోత్సవం, మే 29వ తేదీన చక్రస్నానం జరుగుతాయని వివరించారు. మే 18వ తేదీలోపు బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్ర‌చార ర‌థాల ద్వారా బ్ర‌హ్మోత్స‌వాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. వాహనసేవల సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్‌, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్‌ స్క్రీన్లు(ఎల్‌ఇడి)లు ఏర్పాటుచేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు.

భక్తులకు స్వామివారి అన్నప్రసాదం, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన క‌ళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక‌ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇంజినీరింగ్‌ అధికారులు అదనంగా క్యూలైన్లు, చలువపందిళ్లు వేయాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగ్గా ఉంచాలని సూచించారు. భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేయాలని భద్రతాధికారులను కోరారు. అలాగే టిటిడి ప్రచురణల విక్రయశాల, ప్రథమ చికిత్సా కేంద్రం, ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని జెఈవో సూచించారు.

ఈ సమీక్షలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ వెంక‌ట‌య్య‌, డిఎఫ్ వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, హెచ్‌డిపిపి ప్రాజెక్టు అధికారి డా.. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, డెప్యూటీ ఈఈ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఎఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ఏవిఎస్‌వో శ్రీ పార్థ‌సార‌ధిరెడ్డి ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.